te_tw/bible/kt/intercede.md

2.7 KiB

విజ్ఞాపన చేయు, విజ్ఞాపన

నిర్వచనం:

"విజ్ఞాపన చేయు” “విజ్ఞాపన" అంటే ఎవరినైనా మరొకవ్యక్తి పక్షంగా ప్రాధేయపడు. బైబిల్లో సాధారణంగా ఇతరుల కోసం ప్రార్థన చేయడం అనే అర్థం వస్తుంది.

  • “విజ్ఞాపన చెయ్యడం” “ఒకరి కోసం విజ్ఞాపన చేయు" అంటే దేవుణ్ణి ఇతరుల మేలుకై ప్రార్థించడం.
  • మనకోసం పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు అంటే అయన మనకోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని బైబిల్ బోధిస్తున్నది.
  • ఒక వ్యక్తి ఇతరుల కోసం విజ్ఞాపన చెయ్యడం అంటే అధికారంలో ఉన్నవారిని వేడుకోవడం.

అనువాదం సలహాలు:

  • "విజ్ఞాపన చేయు" దీన్ని అనువదించడానికి ఇతర పద్ధతులు. "బ్రతిమాలు” లేక “(ఎవరినైనా) ఏదైనా చెయ్యమని ప్రాధేయపడు (వేరొకరి కోసం)."
  • "విజ్ఞాపనలు" అనే నామ వాచకాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"విజ్ఞప్తి” లేక “విన్నపం” లేక “అత్యవసర ప్రార్థనలు."
  • "విజ్ఞాపన చేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఫలానా వారి మేలు కోసం” లేక “ఒకరి పక్షంగా వేడుకొను” లేక “దేవుని సహాయం కోసం” లేక “దేవుని దీవెన కోసం (ఎవరికైనా)."

(చూడండి: ప్రార్థించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6293, G1783, G1793, G5241