te_tw/bible/kt/filled.md

3.0 KiB
Raw Permalink Blame History

పరిశుద్ధాత్మతో నింపబడుట

నిర్వచనం:

"పరిశుద్ధాత్మ నింపుదల" అనేది అలంకారికంగా అనే మాట. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగా శక్తి పొంది దేవుని సంకల్పం ప్రకారం చెయ్యడానికి వాడతారు.

  • "తో నిండిపోవడం" అనే మాట "అదుపులో ఉండడం అనే అర్థంలో వాడతారు."
  • "పరిశుద్ధాత్మ నింపుదల" ఉన్నవారు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం పూర్తిగా ఆయనపై సహాయం కోసం ఆధారపడి దేవుడు కోరినది చేస్తారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరిశుద్ధాత్మ మూలంగా శక్తి పొందడం” లేక “పరిశుద్ధాత్మ అదుపులో ఉండడం." అయితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఏదైనా చెయ్యమని.
  • "అతడు పరిశుద్ధాత్మ నింపుదల గల వాడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంపూర్ణంగా ఆత్మ శక్తి ద్వారా నడవడం” లేక “అతడు పూర్తిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు” లేక “పరిశుద్ధాత్మ అతణ్ణి పూర్తిగా నడిపించాడు."
  • ఈ పదానికి సమానార్థకం "ఆత్మ మూలంగా జీవించడం," అయితే "పరిశుద్ధాత్మ నింపుదల" అనేది ఆత్మ పూర్ణత అనే అర్థం ఉంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మకు తనపై అదుపు ఇచ్చి తన జీవితానికి ప్రేరణ పొందడం. కాబట్టి ఈ రెండు మాటలను వివిధ రకాలుగా అనువదించ వచ్చు.

(చూడండి:Holy Spirit)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G00400, G41300, G41370, G41510