te_tw/bible/kt/elect.md

6.6 KiB
Raw Permalink Blame History

ఏర్పరచబడిన,కోరుకోండి,ఏర్పరచబడిన ప్రజలు,ఏర్పరచబడినవాడు,ఎన్నుకొను

నిర్వచనం:

"ఎన్నుకొన్న" పదం అక్షరాలా "ఏర్పరచబడినవారు" లేదా "ఏర్పరచబడిన ప్రజలు" అని అర్థం. దేవుడు తన ప్రజలుగా ఉండడానికి నియమించిన లేదా ఏర్పరచుకొన్నవారిని ఇది సూచిస్తుంది. "ఏర్పరచబడిన వాడు" లేదా "దేవుడు ఏర్పరచిన వాడు" పదం ఏర్పరచబడిన మెస్సీయా అయిన యేసును సూచిస్తున్న బిరుదు.

  • "కోరుకొన్న" అంటే ఒక దానిని లేదా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదా ఒకదాని విషయంలో నిర్ణయించుకోవడం. ప్రజలు తనకు చెందినవారుగా ఉండడానికీ, ఆయన సేవించడానికీ దేవుడు నియమించుకొన్న ప్రజలను ఈ పదం తరచుగా సూచిస్తుంది.
  • "కోరుకొనబడి ఉండడం" అంటే "ఏర్పరచబడియుండడం" లేదా "నియమించబడియుండడం" లేదా ఏదైనా చెయ్యడం.
  • ప్రజలు పరిశుద్ధంగా ఉండడానికీ, ఉత్తమమైన ఆత్మ ఫలం ఫలించే ఉద్దేశం కోసం ఆయన చేత ప్రత్యేకంగా ఉండడానికీ దేవుడు ప్రజలను ఏర్పరచుకున్నాడు. అందుచేత వారు "ఏర్పరచబడిన(వారు)" లేదా "ఎన్నుకొనబడినవారు" అని పిలువబడ్డారు.
  • దేవుడు తన ప్రజల మీద నాయకులుగా నియమించిన మోషే. రాజైన దావీదు వంటి నిర్దిష్టమైన ప్రజలను సూచించడానికి "ఏర్పరచబడినవాడు" అనే పదం కొన్నిసార్లు బైబిలులో ఉపయోగించబడింది. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజగా ఇశ్రాయేలు దేశాన్ని సూచించడానికి కూడా ఈ పదం ఉపయోగించబడింది.
  • "ఎన్నుకొన్న" పదం అక్షరాలా "ఏర్పరచబడినవారు" లేదా "ఏర్పరచబడిన ప్రజలు" అని అర్థం ఇచ్చే పురాతన పదం. ఈ పదం క్రీస్తులో విశ్వాసులను సూచించినప్పుడు ఆదిమ భాషలో ఇది బహువచనం.
  • పాత ఇంగ్లీషు బైబిలు అనువాదములలో "ఏర్పరచబడిన (ప్రజలు)" పదాన్ని పాత, కొత్తనిబంధనలలో "ఎన్నుకొన్న" పదం ఉపయోగించబడింది. అనేక ఆధునిక అనువాదాలు "ఎన్నుకొన్న" పదం యేసులో విశ్వాసం ద్వారా దేవుని చేత రక్షించబడిన ప్రజలను సూచించడానికి కొత్తనిబంధనలో మాత్రమే ఉపయోగించబడింది. బైబిలులోని మిగిలిన చోట్ల ఈ పదం "ఏర్పరచబడినవారు" అని అక్షరార్థంగా అనువదించబడింది.

అనువాదం సలహాలు:

  • "ఎన్నుకొన్న" పదాన్ని "ఏర్పరచబడినవారు" లేదా "ఏర్పరచబడిన ప్రజలు" అనే అర్థం ఇచ్చే పదంతో గానీ లేదా పదబంధంతో గానీ అనువదించడం ఉత్తమమైనది. "దేవుడు కోరుకొన్న ప్రజలు" లేదా "తన ప్రజలుగా ఉండడానికి దేవుడు నియమించిన వారు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "కోరుకొనబడినవారు" పదబంధం "నియమించబడినవారు" లేదా "ఏర్పరచబడినవారు" లేదా "దేవుడు కోరుకొన్న వారు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "నేను నిన్ను కోరుకొన్నాను" అనే పదం "నేను నిన్ను నియమించాను" లేదా "నేను ఏర్పరచుకున్నాను" అని అనువదించబడవచ్చు.
  • యేసు క్రీస్తు విషయంలో "ఏర్పరచబడినవాడు" అనే పదం "దేవుడు కోరుకొన్నవాడు" లేదా "దేవుడు ప్రత్యేకంగా నియమించిన మెస్సీయా" లేదా "(ప్రజలను రక్షించడానికి) దేవుడు నియమించిన వాడు" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి:appoint, Christ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0970, H0972, H0977, H1262, H1305, H4005, H6901, G01380, G01400, G15860, G15880, G15890, G19510, G37240, G44000, G44010, G47580, G48990, G55000