te_tw/bible/kt/deacon.md

2.2 KiB

పరిచారకుడు

నిర్వచనం:

పరిచారకుడు అంటే స్థానిక సంఘంలో సాటి విశ్వాసుల దైనందిన అవసరతలు అంటే ఆహారం, డబ్బు తదితర విషయాల్లో సాయం అందించే వాడు.

  • ఈ పదం "పరిచారకుడు" అనే దాన్ని "సేవకుడు” లేక “పరిచర్య చేసే వాడు" అనే అర్థం ఇచ్చే గ్రీకు పదం నుంచి తర్జుమా చేశారు.
  • ఆది క్రైస్తవుల కాలం నుండి పరిచారకుడు అనే వ్యక్తికి సంఘశరీరం పరిచర్యలో భాగం ఉంది.
  • ఉదాహరణకు, కొత్త నిబంధనలో, పరిచారకులు విశ్వాసులకు అవసరమైన డబ్బు, ఆహారం వితంతువులకు న్యాయంగా పంచిపెట్టేవారు.
  • "పరిచారకుడు" అనే పదాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సంఘం పరిచర్య చేసే వాడు” లేక “సంఘం పనివాడు” లేక “సంఘం సేవకుడు," కొన్ని ఇతర పదాలు స్థానిక క్రైస్తవ సమాజంలో ఒక పథకం ప్రకారం నియమించ బడి ఇదమిద్ధమైన కార్యాచరణల కోసం ఉన్న వ్యక్తిని సూచిస్తున్నది.

(చూడండి: పరిచర్య చేసే వాడు, సేవకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1249