te_tw/bible/other/watchtower.md

2.7 KiB

కావలికోట, కావలికోటలు, కోట

నిర్వచనము:

“కావలికోట” అనే పదము ఒక స్థలమందు కట్టిన అతి ఎత్తైన నిర్మాణములను సూచించును, అక్కడనుండి ఏదైనా అపాయము వచ్చునా అని కాపలాదారులు చూస్తూ ఉంటారు. ఈ కోటలను రాళ్ళతో నిర్మించేవారు.

  • జమీనుదారులు కొన్నిమార్లు కావలికోటలను నిర్మించుకునేవారు, అక్కడనుండి వారు తమ పంటలను కాపాడుకునేవారు మరియు ఎవరూ దొంగలించకుండ సంరక్షించుకునేవారు.
  • కోటలలో అనేకమార్లు కాపలాదారులు లేక వారి కుటుంబం జీవించుటకు గదులను కూడా కట్టేవారు, తద్వారా వారు రాత్రింబవళ్ళు కాపాడుతారు.
  • పట్టణములకొరకైన కావలికోటలు పట్టణపు గోడలకంటే అతి ఎత్తుగా నిర్మించేవారు, తద్వారా వాటి మీద ఉన్నటువంటి కాపలాదారుడు ఎవరైనా పట్టణము దాడి చేయుటకు వస్తున్నారో లేదోనని చూచుటకు అవకాశము ఉంటుంది.
  • “కావలికోట” అనే ఈ పదము శత్రువులనుండి సంరక్షించేందుకు గురుతుగా కూడా ఉపయోగించారు.

(చూడండి: రూపకలంకారము)

(ఈ పదాలను కూడా చూడండి: విరోధి, చూడుము)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H803, H969, H971, H975, H1785, H2918, H4024, H4026, H4029, H4692, H4707, H4869, H6076, H6438, H6836, H6844, G4444