te_tw/bible/other/voice.md

3.1 KiB

స్వరము, స్వరాలు

నిర్వచనము:

“స్వరం” అనే పదం ఎక్కువగా ఏదైనా మాట్లాడుట లేదా ఏదైనా విషయాన్ని గురించిన భావాన్ని వ్యక్తపరచడాన్ని సూచిస్తుంది.

  • సాధారణంగా మనుషులు మాట్లాడునటువంటి స్వరము లేకపోయినప్పటికీ దేవుడు తన స్వరమును ఉపయోగించాలని చెప్పియున్నాడు.
  • “ప్రభువు మార్గమును సిద్ధపరచు” అని అరణ్యములో చెప్పునటువంటి స్వరమును విన్నాను” అనే వాక్కులో ఉన్నట్లుగా ఈ పదము పూర్ణ వ్యక్తిని సూచించుటకు ఉపయోగించబడింది. దీనిని “అరణ్యములో ఒక వ్యక్తి గట్టిగా అరుస్తున్నట్లు విన్నాను” అని కూడా తర్జుమా చేయవచ్చును. (చూడండి: సభ్యోక్తి)
  • “ఒకరి స్వరమును వినుట” అనే మాటను “ఒకరు మాట్లాడునప్పుడు వినుము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • కొన్నిమార్లు “స్వరము” అనే పదము నిజముగా మాట్లాడని కొన్ని వస్తువుల కొరకు కూడా ఉపయోగించబడియుండవచ్చును. ఉదాహరణకు, దావీదు కొన్నిమార్లు కీర్తనలలో ఆకాశ “స్వరము” దేవుని గొప్ప కార్యములను ప్రకటించుచున్నది అని ఉపయోగించాడు. దీనిని “వాటి వైభవము దేవుడు ఎంత మహోన్నతుడోనని స్పష్టముగా చూపించుచున్నవి” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(దీనిని చూడండి: పిలుపు, ప్రకటించుట, వైభవము)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H6963, H7032, H7445, H8193, G2906, G5456, G5586