te_tw/bible/other/torment.md

2.5 KiB

వేదన, వేదనలు, పీడించు, పీడకులు

వాస్తవాలు:

"వేదన" అంటే భయంకర హింసలు. ఎవరినైనా పీడించడం అంటే ఆ వ్యక్తి , తరచుగా క్రూరమైన బాధలు పడేలా చేయడం.

  • కొన్ని సార్లు "వేదన" అనేది శారీరిక నొప్పి, హింసలు సూచిస్తున్నది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథంలో "మృగం" ఆరాధకులకు అంత్య కాలంలో కలిగే శారీరిక వేదన వర్ణించడం ఉంది.
  • హింసలు అంటే ఆత్మ సంబంధమైన , లేక యోబు అనుభవించిన మానసిక బాధ
  • అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథంలో యేసును వారి రక్షకుడుగా విశ్వసించని వారు అగ్ని సరస్సులో నిత్యమైన వేదన అనుభవిస్తారు అని రాశాడు.
  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భయంకర హింసలు” లేక “ఎవరినైనా బాధల పాలు చెయ్యడం” లేక “యాతన." కొందరు అనువాదకులు "భౌతిక” లేక “ఆత్మ సంబంధమైన" అనే పదాలను ఈ అర్థం మరింత స్పష్టం కావడం కోసం వాడవచ్చు.

(చూడండి: మృగం, శాశ్వత, యోబు, రక్షకుడు , ఆత్మ, బాధలు పడు, ఆరాధన)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3013, G928, G929, G930, G931, G2558, G2851, G3600