te_tw/bible/other/submit.md

3.3 KiB

సమర్పించు, సమర్పించును, సమర్పించబడెను, సమర్పించుట, సమర్పణ, సమర్పణలో

నిర్వచనము:

“సమర్పించు” అనే పదమునకు సహజముగా ఒక వ్యక్తి క్రిందగాని లేక ప్రభుత్వము క్రిందగాని తననుతాను స్వయముగా వెళ్లి అప్పగించుకొనుట అని అర్థము కలదు.

  • యేసును నమ్మిన విశ్వాసులు దేవునికి మరియు తమ జీవితాలలో ఇతర అధికారులకు సమర్పించుకోవాలని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది.
  • “ఒకరికొకరు లోబడియుండుడి” అనే ఆదేశమునకు మన స్వంత కార్యములకంటే ఇతరుల అవసరతలను తీర్చాలని మరియు దిద్దుబాటులను తగ్గించుకొని అంగీకరించాలని అర్థము.
  • “ఇతరులకు లోబడియుండుటలో జీవించుడి” అనే ఈ మాటకు ఒకరి అధికారము క్రింద లేక ఏదైనా ఒక అధికారము క్రింద ఒకరు ఉండుట అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “సమర్పించుకొనుము” అనే ఆజ్ఞను “ఒకరి అధికారము క్రింద ఉండుము” లేక “నాయకత్వమును వెంబడించు” లేక “గౌరవించు మరియు ఘనపరచు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సమర్పణ” అనే పదమును “విధేయత” లేక “అధికారమును వెంబడించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “లోబడియుండుటలో జీవించు” అనే ఈ మాటను “విధేయత కలిగియుండు” లేక “అధికారము క్రింద ఉండు” అని తర్జుమా చేయవచ్చును.
  • “సమర్పణలో ఉండు” అనే మాటను “తగ్గించుకొని అధికారమునకు ఒప్పుకొనుము” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: లోబడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3584, H7511, G5226, G5293