te_tw/bible/other/sow.md

5.3 KiB

చెట్టు, చెట్లు, నాటబడెను, నాటుట, నాటిన, తిరిగి నాటుట, మరియొక చోట నాటుట, విత్తు, విత్తును, విత్తబడెను, విత్తుట, విత్తుట

నిర్వచనము:

“చెట్టు” అనగా సాధారణముగా నేల మీద అంటుకట్టబడి పెరిగే దేనినైనా చెట్టు అని అందురు. “విత్తు” అనగా చెట్లు పెరుగుట కొరకు నేలలో విత్తనములను నాటుట అని అర్థము. “విత్తువాడు” అనగా విత్తనములను విత్తే వ్యక్తి లేక నాటే వ్యక్తి అని అర్థము.

  • విత్తుట లేక నాటుట అనేవి విభిన్నముగా ఉంటాయి, అయితే అందులో ఒక విధానము ఏమనగా చేతినిండా విత్తనములు తీసుకొని, వాటిని పొలములో వెదజల్లుట అని అర్థము.
  • విత్తనములు నాటుటకొరకు ఇంకొక విధానము ఏమనగా పొలములో నేల మీద రంధ్రములను చేసి, ఆ రంధ్రములలోనికి విత్తనములను వేయడం.
  • “విత్తు” అనే పదమును అలంకారికముగా కూడా వాడుదురు, ఉదాహరణకు, “మనిషి ఏమి విత్తునో దానినే కోయును” . ఈ మాటకు ఒక వ్యక్తి చెడును చేస్తే, డానికి ఫలితముగా అనానుకూలతలను ఎదుర్కొనును; ఒకవేళ ఒక వ్యక్తి మంచి చేస్తే, అతను అనుకూలమైన ఫలితమును పొందుకొనును అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “విత్తు” అనే పదమును “నాటు” అని కూడా తర్జుమా చేయుదురు. తర్జుమా చేయబడిన ఈ పదము విత్తనములను నాటుట అనే అర్థము వచ్చునట్లు కూడా జాగ్రత్తపడండి.
  • “విత్తువాడు” అనే పదమును తర్జుమా చేయు అనేక విధానములలో “నాటువాడు” లేక “రైతు” లేక “విత్తనములను నాటే వ్యక్తి” అనే మాటలను కూడా వినియోగించుదురు.
  • ఆంగ్లములో “విత్తు” అనే పదమును విత్తనములను నాటుటను గూర్చి మాత్రమె ఉపయోగిస్తారు, అయితే ఆంగ్లములో “నాటు” అనే పదమును విత్తములను నాటుటను గూర్చి మరియు పెద్ద పెద్ద చెట్లను నాటుటను గూర్చియు ఉపయోగిస్తారు. ఇతర భాషలు కూడా నాటబడిన దానిని ఆధారము చేసికొని ఇతర విభిన్న పదాలను ఉపయోగించవచ్చు.
  • “ఒక వ్యక్తి తాను ఏది విత్తుతాడో దానినే కోయును” అనే ఈ మాటను “ఒక చెట్టు ఆ చెట్టుకు సంబంధించిన విత్తనములను ఏ విధంగా ఇస్తుందో, అదేవిధముగా ఒక వ్యక్తి మంచి క్రియలు కూడా మంచి ఫలితాన్ని తీసుకొని వస్తాయి మరియు ఆ వ్యక్తి చెడు క్రియలు చేసినట్లయితే చెడ్డ ఫలితాన్ని తీసుకొని వస్తాయి” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: దుష్ట, మంచి, కోయడం)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2221, H2232, H2233, H2236, H4218, H4302, H5193, H7971, H8362, G4687, G4703, G5300, G5452 , G6037