te_tw/bible/other/send.md

3.6 KiB

పంపించు, పంపబడిన, బయటికి పంపు

నిర్వచనం:

“పంపించు” అంటే ఎవరినైనా లేదా దేనినైనా ఒక చోటికి పంపించేలా చెయ్యడం. "బయటికి పంపించడం" అంటే ఒకరిని ఏదైనా పని మీదా లేదా ఒక కర్తవ్యం మీద వెళ్ళమని చెప్పడం.

  • తరచుగా "బయటకి పంపించబడిన” వ్యక్తి ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి నియమించబడ్డాడు.
  • “వర్షాన్ని పంపించు” లేదా “విపత్తును పంపించు” లాంటి పదబంధాలు "రావడానికి కారణం" అని అర్థాన్ని ఇస్తాయి. ఈ విధమైన వాక్యాలు సాధారణంగా దేవుడే వీటిని జరిగించడానికి కారణం అని దేవుణ్నిసూచించడానికి ఉపయోగించబడ్డాయి.
  • “పంపించు” పదం “వాక్యమును పంపించు” లేదా “సందేశమును పంపించు” లాంటి వ్యక్తీకరణలలో కూడా ఉపయోగించబడ్డాయి. ఒకరికి సందేశాన్ని చెప్పాలని మరొకరికి చెప్పడం అని అర్థం.
  • ఒకదాని"తో" ఒకరిని పంపడం అంటే ఆ వస్తువును అతని"కి" "ఇవ్వు" అని అర్థం. సాధారణముగా ఆ వ్యక్తి దానిని పొందుకొనునట్లు ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతానికి కదలడం అని అర్థం.
  • “నన్ను పంపిన వాడు” అని యేసు తరచుగా ఉపయోగించాడు, ప్రజలను రక్షించడానికీ, వారిని విమోచించడానికీ భూమి మీదకు యేసును పంపించిన తండ్రియైన దేవుణ్ణి సూచిస్తున్నాడు. ఇది "రాబోతున్నవాడు" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: నియమించడం, విమోచించడం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H935, H1540, H1980, H2199, H2904, H3318, H3474, H3947, H4916, H4917, H5042, H5130, H5375, H5414, H5674, H6963, H7368, H7725, H7964, H7971, H7972, H7993, H8421, H8446, G782, G375, G630, G649, G652, G657, G1026, G1032, G1544, G1599, G1821, G3333, G3343, G3936, G3992, G4311, G4341, G4369, G4842, G4882