te_tw/bible/other/selah.md

1.8 KiB

సెలా

నిర్వచనము:

“సెలా” అనే ఈ పదము హెబ్రీ భాషకు సంబంధించిన పదము, ఇది కీర్తనల గ్రంథములో ఎక్కువమార్లు కనబడుతుంది. దీనికి అనేకమైన అర్థములు కలవు.

  • దీనికి “ఆపుట మరియు స్తుతి” అని అర్థము కలదు, కీర్తనను కాసేపు ఆపినప్పుడు (సెలా) ప్రజలందరూ ఆ కీర్తనలో చెప్పబడినదానిని గూర్చి ఆలోచించాలి.
  • అనేక కీర్తనలు పాటలుగా వ్రాయబడినప్పటికిని, “సెలా” అనే సంగీత సంబంధమైన పదము చెప్పినప్పుడు, పాట పాడుచున్న గాయకుడు పాటను కొంత సమయము ఆపాలి. ఆ సమయములో కేవలము వాయిద్యములతో సంగీతమును వినిపించాలి. అప్పుడు శ్రోతలు పాటలోని సాహిత్యమును గ్రహించి ప్రోత్సహించబడుదురు.

(ఈ పదములను కూడా చూడండి: కీర్తన)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H5542