te_tw/bible/other/rod.md

3.2 KiB

బెత్తము, బెత్తములు

నిర్వచనము:

“బెత్తము” అనే ఈ పదము అనేక విధాలుగా ఉపయోగించే తిన్నని, బలమైన కట్టెలాంటి పరికరమును సూచించును. ఇది బహుశః దరిదాపు ఒక మీటరు పొడువైన ఉంటుంది.

  • కట్టె బెత్తమును ఇతర ప్రాణులు గొర్రెలను అపహరించకుండ కాపాడుటకు కాపరి ద్వారా ఉపయోగించబడును. తప్పిపోతున్న గొర్రెను మందలోనికి తీసుకొని వచ్చుటకు కూడా దీనిని వినియోగిస్తారు.
  • 23వ కీర్తనలో రాజైన దావీదు “దుడ్డు కర్ర” మరియు “దండము” అనే పదములను దేవుని మార్గదర్శకత్వము మరియు తన ప్రజల కొరకైన క్రమశిక్షణను సూచించుటకు అలంకారికముగా వాడుతాడు.
  • కాపరి దుడ్డు కర్రను దాని క్రింద వెళ్ళే గొర్రెలను లెక్కించుటకు కూడా ఉపయోగించడమైనది.
  • “ఇనప దండము” అనే ఇంకొక అలంకారిక మాట దేవునికి విరుద్ధముగా తిరస్కరించి, చెడు పనులు చేయుచున్న ప్రజల కొరకు వచ్చెడి దేవుని శిక్షను సూచిస్తుంది.
  • పురాతన కాలములో, కొలబద్దలను లోహముతోను, కట్టెతోనూ లేక రాయితోను చేసుకొని ఒక వస్తువునిగాని లేక ఒక భవనపు ఎత్తును కొలిచేవారు.
  • పరిశుద్ధ గ్రంథములో కట్టెతో చేసిన బెత్తమును కూడా పిల్లలను క్రమశిక్షణలో ఉంచుటకు ఒక పరికరముగా వాడియున్నారు.

(ఈ పదములను కూడా చూడండి: దండము, గొర్రె, కాపారి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2415, H4294, H4731, H7626, G2563, G4463, G4464