3.9 KiB
3.9 KiB
ప్రతిఫలము, ప్రతిఫలమిచ్చును, ప్రతిఫలమివ్వబడెను, ప్రతిఫలమిచ్చుట, ప్రతిఫలమిచ్చువాడు
నిర్వచనము:
“ప్రతిఫలము” అనే ఈ పదము ఒక వ్యక్తి చేసిన మంచి పనులకైన లేక చెడు పనులకైన పొందుకొనే వాటిని సూచిస్తుంది. ఒకరికి “ప్రతిఫలము” ఇవ్వడము అనగా అతను పొందదగినవాటిని అతనికి ఇవ్వడము అని దాని అర్థము.
- ఒక వ్యక్తి పొందుకొనేది మంచిదైయుండవచ్చు లేక అనుకూలమైన విషయమేదైనా ఉండవచ్చు ఎందుకంటే అతను మంచివాటిని చేసియున్నాడు లేక అతను దేవునికి విధేయత చూపియున్నాడు.
- కొన్నిమార్లు చెడు ప్రవర్తనను బట్టి ప్రతిఫలము అనానుకూలమైన విషయాలను కూడా సూచిస్తుంది, ఉదాహరణకు, “దుష్టత్వపు ప్రతిఫలము” అని చెప్పుకొనవచ్చును.
ఈ సందర్భములో చెప్పబడిన “ప్రతిఫలము” వారు తమ పాపభూయిష్టమైన క్రియలను బట్టి వారు పొండుకొనే శిక్ష లేక అనానుకూలమైన పరిణామాలను సూచిస్తుంది.
తర్జుమా సలహాలు:
- సందర్భానుసారముగా, “ప్రతిఫలము” అనే ఈ పదమును “వేల చెల్లించుట” లేక “పొందనర్హమైనది” లేక “శిక్ష” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- ఒకరికి “ప్రతిఫలము” ఇచ్చుట అనే మాటను “వెల చెల్లించుట” లేక “శిక్షించుట” లేక “పొందదగినవాటిని ఇచ్చుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
- ఈ పదమునకు చేసిన తర్జుమా పదము వేతనాలను సూచించకుండునట్లు జాగ్రత్తపడుడి. ప్రతిఫలము అనునది విశేషముగా ఉద్యోగములో భాగముగా డబ్బును సంపాదించే ఉపాది కాదు.
(ఈ పదములను కూడా చూడండి: శిక్షించు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- ద్వితీ.32:5-6
- యెషయా.40:9-10
- లూకా.06:35-36
- మార్కు.09:40-41
- మత్తయి.05:11-12
- మత్తయి.06:3-4
- మత్తయి.127:3-5
- ప్రకటన.11:18
పదం సమాచారం:
- Strong's: H319, H866, H868, H1576, H1578, H1580, H4864, H4909, H4991, H5023, H6118, H6468, H6529, H7809, H7810, H7936, H7938, H7939, H7966, H7999, H8011, H8021, G469, G514, G591, G2603, G3405, G3406, G3408