te_tw/bible/other/reed.md

2.2 KiB

రెల్లు గడ్డి, జమ్ముగడ్డి

వాస్తవాలు:

“రెల్లు గడ్డి” అనే ఈ మాట నీటిలో పెరిగే పొడువాటి రెమ్మను కలిగిన ఒక చిన్న నారు ముడిని సూచిస్తుంది.

  • మోషే ఒక శిశువుగా దాచిపెట్టబడిన నైల్ నదిలోని జమ్ముగడ్డిని “తుంగ” అని కూడా పిలుస్తారు. అవి చాలా ఎత్తుగా ఉంటాయి, అవి ఒక నది నీటిలోని దట్టమైన తోపుల మధ్యన పెరిగే బెండు కాండము కలిగియున్న మొక్కలు.
  • పురాతన ఐగుప్తులో కాగితములను, గంపలను మరియు పడవలను చేయుటకు ఈ పీచు మొక్కలను ఉపయొగిస్తూ ఉండేవారు.
  • ఇటువంటి బెండు ఉన్న రెల్లు మొక్క వంగే విధంగా ఉంటుంది మరియు గాలి వచ్చినప్పుడు చాలా సుళువుగా వాలిపోతుంది.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి: ఐగుప్తు, మోషే, నైల్ నది)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు

పదం సమాచారం:

  • Strong's: H98, H100, H260, H5488, H6169, H7070, G2063, G2563