te_tw/bible/other/quench.md

2.7 KiB

ఆర్పుట, తీర్చబడెను, తీర్చ సాధ్యముకాని

నిర్వచనము:

“ఆర్పుట” అనే ఈ పదమునకు ఆర్పివేయుట లేక తృప్తిపరచబడాలని కోరుకొను దేనినైనా నిలిపివేయుట అని అర్థము.

  • ఈ పదమును సాధారణముగా దాహము తీర్చుట అనే సందర్భములో ఉపయోగించుదురు మరియు ఏదైనా పానీయాలు త్రాగుట ద్వారా దాహమును తీర్చుట అని అర్థము.
  • ఇది అగ్నిని ఆర్పుట అని సూచించుటకు ఉపయోగించబడును.
  • దాహము మరియు అగ్ని అనే ఈ రెండు నీటి ద్వారా ఆర్పబడును.
  • “ఆర్పుట” అనే పదమును పౌలు గారు అలంకారిక విధానములో ఉపయోగించారు, “పరిశుద్ధాత్ముని ఆర్పకుడి” అని విశ్వాసులకు హెచ్చరికగా చెప్పియున్నాడు. ఈ మాటకు ప్రజలలో ఫలాలు మరియు వరాలు కలిగించేందుకు పరిశుద్ధాత్ముని అనుమతించకుండ ఉండేవిధంగా వారిని నిరుత్సాహ పరచవద్దు అని అర్థము. పరిశుద్ధాత్ముని అణచుట లేక ఆర్పివేయుట అనగా పరిశుద్ధాత్ముడు తన శక్తిని మరియు కార్యమును తన ప్రజలలో జరిగించకుండ ఉండేవిధంగా అడ్డుకొనుట అని అర్థము.

(ఈ పదములను చూడండి: ఫలము, వరము, పరిశుద్ధాత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1846, H3518, H7665, H8257, G762, G4570