te_tw/bible/kt/gift.md

2.9 KiB

కానుక, కానుకలు

నిర్వచనం:

"కానుక" అంటే ఎవరికైనా అర్పించేది. కానుక ప్రతిఫలం ఆశించి ఇచ్చేది కాదు.

  • డబ్బు, ఆహారం, బట్టలు, లేక ఇతర వస్తువులు పేద వారికి ఇచ్చినా వాటిని "కానుకలు" అనవచ్చు.
  • బైబిల్లో, దేవునికి ఇచ్చే అర్పణ, లేక బలి అర్పణ కానుక.
  • రక్షణ అనేది యేసులో విశ్వాసం మూలంగా దేవుడు ఇచ్చే కానుక.
  • కొత్త నిబంధనలో, "వరాలు" అనే మాటను దేవుడు ఇతరులకు పరిచర్య నిమిత్తం అందరు క్రైస్తవులకు ఇచ్చే ప్రత్యేక ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు అనే అర్థంలో కూడా వాడతారు.

అనువాదం సలహాలు:

  • సామాన్య పదం "కానుక" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "ఇచ్చినది ఏదైనా."
  • దేవుడు ఎవరికైనా కానుక, లేక ప్రత్యేక సామర్థ్యం ఇస్తే, అలాటి "ఆత్మ వరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆత్మ సంబంధమైన సామర్థ్యం” లేక “పరిశుద్ధాత్మ నుండి ప్రత్యేక సామర్థ్యం” లేక “దేవుడు ఇచ్చే ప్రత్యేక ఆత్మ సంబంధమైన నైపుణ్యం."

(చూడండి: ఆత్మ, పరిశుద్ధాత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486