te_tw/bible/other/pillar.md

4.5 KiB

నిలువు, వరసలు, స్తంభము, స్తంభములు

నిర్వచనము:

“స్తంభము” అనే పదము సాధారణముగా పైకప్పును భారము పట్టుకొని ఉండుటకు ఉపయోగించే ఒక పెద్ద నిలువు కట్టడను సూచించును. “స్తంభము” అను పదానికి మరియొక పదము “నిలువు” అని అంటారు.

  • పరిశుద్ధ గ్రంథ కాలములో భవనములను నిర్మించుటలో పడిపోకుండా నిలువబెట్టుటకు ఉపయోగించే స్తంభములు సాధారణముగా ఒకే రాతినుండి చెక్కేవారు.
  • పాత నిబంధనలో సంసోను ఫిలిష్టియులుచేత పట్టబడినప్పుడు, అతనిని దేవాలయములో కట్టివేసి ఉంచినప్పుడు ఆ స్తంభములను గట్టిగా లాగుట ద్వారా వారి అన్య దేవాలయమును నాశనము చేసెను.
  • “స్తంభము” అనే పదము కొన్నిమార్లు ఒక గొప్ప సంఘటన జరిగిన చోట గురుతుగా ఉంచుటకు లేక సమాధివద్ద జ్ఞాపకార్ధముగా పెట్టుటకు ఒక పెద్ద రాయిని లేక చెక్కిన ఒక పెద్ద రాతి బండను సూచిస్తుంది.
  • ఒక అబద్ధపు దేవుణ్ణి ఆరాధించుటకు చేసే ఒక విగ్రహమును కూడా ఈ పదము సూచిస్తుంది. ఈ పదము “చెక్కిన రూపము” అనే మాటకు కూడా వర్తిస్తుంది మరియు దీనిని “ప్రతిమ” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “స్తంభము” అనే పదమును ఒక స్తంభములాగా ఆకారములో ఉన్నదానిని సూచించుటకు ఉపయోగించబడినది, ఉదాహరణకు, ఇశ్రాయేలీయులను అరణ్యము ద్వారా రాత్రి పూట నడిపించిన “అగ్ని స్తంభము” లేక లోతు భార్య పట్టణమును వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె “ఉప్పు స్తంభముగా” మారడము.
  • భవనము పడిపోకుండా ఉంచే ఒక కట్టడగా ఉపయోగించే “స్తంభము” లేక “నిలువు కట్టడ” అనే పదములను “దూలము పడిపోకుండా పెట్టె నిలువెత్తు రాయి” లేక “పడిపోకుండా కట్టే రాతి కట్టడ” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • “స్తంభము” అనే పదమును ఉపయోగించే వాటిలో “ప్రతిమ” లేక “గుట్ట” లేక “దిబ్బ” లేక “స్మారక చిహ్నం” లేక “పొడవైన ద్రవ్యరాశి” అని సందర్భానుసారముగా ఉపయోగిస్తారు.

(ఈ పదములను కూడా చుడండి: స్థాపన, అబద్ధపు దేవుడు, రూపం)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H352, H547, H2106, H2553, H3730, H4552, H4676, H4678, H4690, H5324, H5333, H5982, H8490, G4769