te_tw/bible/other/foundation.md

3.4 KiB

స్థాపన, స్థాపించిన, వ్యవస్థాపకుడు, పునాది, పునాదులు

నిర్వచనం:

"స్థాపన" అంటే నిర్మాణం, సృష్టించడం, లేక ఒకదానికి ప్రాతిపదిక ఏర్పరచడం. "స్థాపించిన" అంటే ఒక దానిపై ఆధార పడిన అని అర్థం. "పునాది" అంటే దేన్నైనా నిర్మించడానికి, లేక సృష్టించడానికి ఉపయుక్తం అయ్యేది.

  • ఇంటి పునాది బలమైనదిగా మొత్తం కట్టడానికి ఆధారపడదగినదిగా ఉండాలి.
  • "పునాది" అనే మాటను దేన్నైనా ఆరంభం చెయ్యడానకి దేన్నైనా మొదట సృష్టించిన సమయానికి వాడవచ్చు.
  • అలంకారికంగా, క్రీస్తు విశ్వాసులను క్రీస్తు తానే భవనానికి మూలరాయిగా అపోస్తలుల, ప్రవక్తల బోధలు పునాదిగా ఉన్న నిర్మాణంతో పోల్చారు.
  • "పునాది రాయి" అంటే పునాదిలో భాగంగా పెట్టిన రాయి. ఈ రాళ్లు బలమైనవా కాదా, మొత్తం భవనాన్ని నిలబెడతాయా లేదా అని చూస్తారు.

అనువాదం సలహాలు:

  • "లోకం పునాదికి ముందు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "లోక సృష్టికి ముందు” లేక “లోకం ఉనికిలోకి రాక ముందు” లేక “ప్రతిదాన్నీ మొదట సృష్టించక ముందు."
  • "స్థాపించిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భద్రంగా నిర్మించు” లేక “స్థిరంగా నిలుపు."
  • సందర్భాన్ని బట్టి, "పునాది" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బలమైన ఆధారం” లేక “బలమైన అండ” లేక “ఆరంభ” లేక “సృష్టి."

(చూడండి: మూలరాయి, సృష్టించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H134, H787, H803, H808, H2713, H3245, H3247, H3248, H4143, H4144, H4146, H4328, H4349, H4527, H6884, H8356, G2310, G2311, G2602