5.1 KiB
5.1 KiB
సృష్టించు, సృష్టించిన, సృష్టి, సృష్టికర్త
నిర్వచనం:
ఈ పదం "సృష్టించు" అంటే దేన్నైనా చేయడం. దేన్నైనా ఉండేలా చేయడం. సృష్టించబడినది ఏదైనా "సృష్టి" అంటారు. దేవుణ్ణి "సృష్టికర్త" అన్నారు. ఎందుకంటే అయన ప్రతిదాన్నీ విశ్వం అంతటినీ ఉనికి లోకి తెచ్చాడు.
- దేవుడు లోకాన్ని సృష్టించడంలో ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు అయన శూన్యంలోనుండి దాన్ని చేశాడని అర్థం.
- మానవులు దేన్నైనా "సృష్టి చేస్తే" వారు ఇప్పటికే ఉనికిలో ఉన్న వస్తువులతో చేస్తారు.
- కొన్ని సార్లు "సృష్టించు" అనే పదాన్ని దేన్నైనా నైరూప్య అంశాన్ని అలంకారికంగా వర్ణించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు సృష్టించడం శాంతిని, లేక ఎవరిలోనైనా శుద్ధ హృదయాన్ని సృష్టించడం చెప్పడానికి వాడతారు.
- ఈ పదం "సృష్టి"ని లోకం ఆరంభస్థితిని, అంటే దేవుడు మొదటి సృష్టిని చేసిన కాలాన్ని చెప్పడం కోసం వాడతారు. సాధారణంగా దేవుడు చేసిన ప్రతిదాన్నీ చెప్పడంకోసం ఇది ఉపయోగిస్తారు. కొన్ని సార్లు ఈ పదం "సృష్టి" ఇదమిద్ధంగా లోకంలోని మనుషుల కోసం మాత్రమే వాడతారు.
అనువాదం సలహాలు:
- కొన్ని భాషల్లో దేవుడు లోకాన్నిశూన్యంలోనుంచి సృష్టించిన సంగతి స్పష్టంగా నేరుగా చెప్పే పదాలు ఉండవచ్చు.
- పద బంధం, "లోకం సృష్టి మొదలు నుండి" అంటే, "దేవుడు లోకాన్ని సృష్టించిన నాటి నుండి."
- ఇలాటిదే మరొక పద బంధం, "సృష్టి ఆరంభం" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "ఆదిలో దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు” లేక “లోకం మొదట సృష్టించబడినప్పుడు."
- సువార్తను "సృష్టి అంతటికీ ప్రకటించడం” అంటే సువార్తను "భూమిపై అన్ని చోట్లా ప్రజలందరికీ" ప్రకటించడం.
- పద బంధం "సృష్టి ఆనందించాలి" అంటే " దేవుడు సృష్టించిన ప్రతిదీ ఆనందించాలి."
- సందర్భాన్ని బట్టి, "సృష్టించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "చెయ్యడం” లేక “కలిగించడం” లేక “శూన్యంలోనించి తయారు చెయ్యడం."
- ఈ పదం" సృష్టికర్త" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ప్రతిదాన్నీ సృష్టించిన వాడు.” లేక “లోకమంతటిని చేసిన దేవుడు."
- "నీ సృష్టికర్త" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిన్ను చేసిన దేవుడు."
(చూడండి: దేవుడు, మంచి వార్త, లోకం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3335, H4639, H6213, H6385, H7069, G2041, G2602, G2675, G2936, G2937, G2939, G4160, G5480