te_tw/bible/other/mourn.md

3.4 KiB

దుఃఖించు, దుఃఖించడం, దుఃఖించాడు, దుఃఖిస్తున్నాడు, దుఃఖించువాడు, దుఃఖించువారు, దుఃఖముఖులు, దుఃఖకరమైన, దుఃఖకరంగా

వాస్తవాలు:

“దుఃఖించు,” “దుఃఖించడం” అనే పదాలు లోతైన విచారాన్ని వ్యక్తపరచడాన్ని సూచిస్తున్నాయి, సాధారణంగా ఒకరి మరణం విషయంలో తమ విచారాన్ని (శోకాన్ని) కనుపరచదం.

  • అనే సంస్కృతులలో దుఃఖించడంలో విచారం, శోకం కనపడే నిర్దిష్టమైన బాహ్య ప్రవర్తనలు కనిపిస్తాయి.
  • పురాతన కాలాలలో ఇశ్రాయేలీయులూ, ఇతర ప్రజాగుంపుల వారూ గట్టి రోదనం, విలాపాలు చెయ్యడం ద్వారా తమ దుఃఖాన్ని వ్యక్తపరుస్తారు. వారు దళసరి వస్త్రంతో చెయ్యబడిన గొనెపట్టలు ధరిస్తారు, తమ మీద బూడిదను వేసుకొంటారు.
  • దుఃఖించేవారిని, సాధారణంగా స్త్రీలను బాడుగకు తెచ్చుకుంటారు, ఒకరు చనిపోయినదగ్గరనుండి సమాధిలో పెట్టేంతవరకు వారు గట్టిగా ఏడుస్తారు, రోదనం చేస్తారు.
  • రోదనం చేసే కాలం ఏడురోజులవరకూ ఉంటుంది. అది ముప్పది రోజాల వరకు కొనసాగుతుంది (మోషే, ఆహారోనుల కోసం చేసినట్టు) లేక డెబ్బది రోజుల వరకు (యాకోబు విషయంలో చేసినట్టు).
  • పాపం విషయంలో “దుఃఖించడం” గురించి బైబిలు ఈ పదాన్ని రూపకాలంకారంగా వినియోగిస్తుంది.

పాపం దెవున్నీ, మనుషులను గాయపరుస్తుంది కనుక లోతైన దుఃఖభావనను తెలియపరుస్తుంది.

(చూడండి: గొనెపట్ట, పాపం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H56, H57, H60, H205, H578, H584, H585, H1058, H1065, H1068, H1669, H1671, H1897, H1899, H1993, H4553, H4798, H5092, H5098, H5110, H5594, H6937, H6941, H6969, H7300, H8386, G2354, G2875, G3602, G3996, G3997