te_tw/bible/other/lover.md

2.9 KiB

ప్రేమికుడు (ప్రియుడు), ప్రేమికులు

నిర్వచనం:

“ప్రియుడు” అనే పదం అంటే అక్షరాలా “ప్రేమించు వ్యక్తి” అని అర్థం. సాధారణంగా ఒకరికొకరు లైంగిక సంబంధంలో ఉన్నవ్యక్తులను సూచిస్తుంది.

  • ”ప్రియుడు” అనే పదం బైబిలులో వినియోగించబడినప్పుడు, ఒక వ్యక్తి తాను వివాహం చేసుకోబోయేవారితో లైంగిక సంబంధంలో ఉన్న వ్యక్తిని సూచిస్తుంది.
  • బైబిలులో వినియోగించబడిన అక్రమ లైంగిక సంబంధం విగ్రహాలను ఆరాధించడం ద్వారా దేవునికి అవిధేయత చూపించిన ఇస్రాయేలీయులను సూచిస్తుంది. “ప్రేమికులు” అనే పదం కూడా అలంకారంగా ఇశ్రాయేలీయులు పూజించిన విగ్రహాలను సూచిస్తుంది. ఈ సందర్భాలలో, ఈ పదాన్ని, “దుర్నీతి భాగస్వామ్యులు” లేక “వ్యభిచారంలో భాగస్వామ్యులు” లేక “విగ్రహాలు” అని అనువాదం చెయ్యవచ్చు. (చూడండి: రూపకం)
  • ధనమును “ప్రేమించువాడు” డబ్బు సంపాదించడానికీ, ధనవంతుడిగా ఉండడానికీ అధిక ప్రాధాన్యతను ఇచ్చువాడు.
  • పాతనిబంధనలో పరమగీతముల గ్రంథంలో “ప్రేమికుడు” అనే పదం యదార్థమైన విధానంలో వినియోగించబడింది.

(చూడండి: వ్యభిచారం, అబద్దపు దేవుడు, అబద్దపు దేవత, ప్రేమ)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H157, H158, H868, H5689, H7453, H8566, G865, G866, G5358, G5366, G5367, G5369, G5377, G5381, G5382