te_tw/bible/other/lamp.md

2.4 KiB

దీపం, దీపాలు

నిర్వచనం:

“దీపం” అనే పదం సాధారణంగా కాంతిని కలిగించే దానిని సూచిస్తుంది. బైబిలు కాలంలో వినియోగించిన దీపాలు సహజంగా నూనె దీపాలు. బైబిలు కాలంలో వినియోగించిన దీపాలు ఇంధన ఆధారంతో కూడిన చిన్న పాత్ర, సహజంగా నూనె, అది కాలినప్పుడు కాంతిని ఇస్తుంది.

  • ఒక సాధారణమైన దీపంలో ఒలీవ నూనెతో నిండిన సాధారణమైన పాత్ర, ఆ నూనెలో కాలడానికి ఒక ఒత్తి ఉంటుంది.
  • కొన్ని దీపాలకు పాత్ర అండాశయ ఆకారంలో ఉంటుంది, దానికి ఒక అంచు మూసి ఉంటుంది, మరొకవైపు ఒక తిత్తిని గట్టిగా పట్టుకుని ఉంటుంది.
  • నూనె దీపాన్ని మరో చోటికి తీసుకొని వెళ్ళవచ్చు లేక ఆ గదిలో లేక ఇంటిలో కాంతి నిండిపోయేలా దీప స్థంభం మీద ఉంచుతారు.
  • లేఖనాలలో, దీపాలను వెలుగుకూ, జీవానికీ గుర్తులుగా అనేక ఉపమానాలుగా వినియోగించారు.

(చూడండి: దీపస్తంభం, జీవం, వెలుగు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3940, H3974, H4501, H5215, H5216, G2985, G3088