te_tw/bible/other/integrity.md

2.3 KiB

యథార్థత

నిర్వచనం:

"యథార్థత" అంటే నీతిగా ఒక బలమైన నైతిక సూత్రాలతో, నియమాలతో కూడిన ప్రవర్తన ఉంటే దాన్ని యథార్థత అంటారు.

  • యథార్థత కలిగి ఉండడం అంటే ఎవరూ కనిపెట్టి చూస్తూ ఉండకపోయినా సరియైన దాన్ని చేయడాన్ని ఎన్నుకుని ఆ ప్రకారం ప్రవర్తించడం.
  • బైబిల్లో యోసేపు, దానియేలు వంటి వారి గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారు దుష్ట క్రియలు చేయడానికి నిరాకరించి దేవునికే లోబడడానికి నిశ్చయించుకున్నారు.
  • సామెతలు గ్రంథం అవినీతి, చెడు తనం మూలంగా ధనికులుగా ఉండడం కంటే యథార్థత గలిగి పేద వారుగా ఉండడమే మంచిది అని చెబుతున్నది.

అనువాదం సలహాలు

  • "యథార్థత" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిజాయితీ” లేక “నైతిక వర్తన” లేక “సత్యపూర్ణమైన ప్రవర్తన” లేక “నమ్మదగిన దాన్ని నిజాయితీగా అంగీకరించడం."

(చూడండి: దానియేలు, యోసేపు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3476, H6664, H6666, H8535, H8537, H8538, H8549, G4587