te_tw/bible/names/josephot.md

3.6 KiB

యోసేపు (పా ని)

వాస్తవాలు:

యోసేపు యాకోబు ద్వారా తన తల్లి రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు.

  • యోసేపు తన తండ్రి ప్రేమను చూరగొన్న కుమారుడు.
  • అతని సోదరులు ఈర్ష్యతో అతన్ని బానిసత్వంలోకి అమ్మివేసారు.
  • ఈజిప్టులో, యోసేపుపై అబద్ధమైన నేరం మోపి చెరసాలలో వేశారు.
  • ఎన్ని కష్టాలున్నా యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
  • దేవుడు అతన్ని ఈజిప్టులో రెండవ అత్యున్నత స్థితికి తీసుకు వచ్చాడు. కరువు కాలంలో అతడు ప్రజానీకాన్ని రక్షించగలిగేలా నిలబెట్టాడు. ఈజిప్టు ప్రజలు, తన స్వంత కుటుంబం, ఆకలి చావులు తప్పించుకున్నారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఈజిప్టు, యాకోబు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:02 యోసేపు సోదరులు అతన్ని ద్వేషించారు. ఎందుకంటే వారి తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. అంతేకాదు యోసేపు తాను వారి అధిపతి అవుతాడని కలగన్నాడు.
  • 08:04 బానిస వర్తకులు యోసేపు ను ఈజిప్టుకు తీసుకుపోయారు.
  • 08:05 చెరసాలలో సైతం యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతన్ని దీవించాడు.
  • 08:07 దేవుడు యోసేపు కు కలలు వివరించే సామర్థ్యం ఇచ్చాడు. ఫరో యోసేపును చెరసాల నుండి బయటకు రప్పించాడు.
  • 08:09 ఏడు సంవత్సరాలు మంచి కోత కాలాల వల్ల ఎక్కువ ధాన్యం నిలవ చేయాలని యోసేపు చెప్పాడు.
  • 09:02 ఈజిప్టు వారు యోసేపు ను అతడు చేసిన సహాయం అంతటినీ మర్చిపోయారు.

పదం సమాచారం:

  • Strong's: H3084, H3130, G2500, G2501