te_tw/bible/other/honey.md

3.0 KiB

తేనె, తేనె పట్టు

నిర్వచనం:

"తేనె" తియ్యని, జిగురు, పదార్థం. పువ్వుల మకరందం లోనుండి తేనెటీగలు తయారు చేసేది. తేనె పట్టు అంటే తేనెటీగలు తయారు చేసే మైనపు ఫ్రేము. ఇందులో అవి తేనె నిలవ చేస్తాయి.

  • రకాన్ని బట్టి తేనె పసుపు, గోధుమ రంగుల్లో ఉండవచ్చు.
  • తేనె అడవి చెట్ల తొర్రల్లో లేక తేనెటీగలు ఎక్కడ పట్టు పెడితే అక్కడ దొరుకుతుంది. మనుషులు తేనె తినడానికి, అమ్మడానికి తేనె పట్టు ఉండే పెట్టెలు వాడతారు. అయితే బహుశా బైబిల్లో ప్రస్తావించినది సహజంగా దొరికే తేనె.
  • బైబిల్లో ముగ్గురు ఇదమిద్ధంగా సహజమైన తేనె తిన్నట్టు రాసి ఉంది. యోనాతాను, సంసోను, బాప్తిసమిచ్చే యోహాను.
  • ఈ పదాన్ని తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు. దేన్నైనా మధురమైన రుచికరమైనదాన్నిఇలా సూచిస్తారు. ఉదాహరణకు, దేవుని మాటలు, కట్టడలు “తేనెకన్నా మధురం." (చూడండి: ఉపమ, రూపకాలంకారంగా)
  • కొన్ని సార్లు వ్యక్తి మాటలు తేనె వలె తియ్యని అంటారు. అయితే ఇతరులను మోసగించి హాని తలపెట్టే విషయం కూడా ఇక్కడ ఉంది.

(చూడండి: యోహాను (బాప్తిసమిచ్చే), యోనాతాను, ఫిలిష్తీయులు, సంసోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1706, H3293, H3295, H5317, H6688, G2781, G3192, G3193