te_tw/bible/other/gold.md

3.1 KiB

బంగారం, బంగారు

నిర్వచనం:

బంగారం పసుపు రంగులో ఉండే ప్రశస్తమైన లోహం. దీన్ని ఆభరణాలు, మత సంబంధమైన వస్తువులు చెయ్యడంలో ఉపయోగిస్తారు. ఇది ప్రాచీన కాలంలో ఎక్కువ విలువైన లోహం.

  • బైబిల్ కాలాల్లో, అనేక వివిధ రకాల వస్తువులను ముద్ద బంగారంతో చేసేవారు. లేక బంగారు రేకు తాపడం చేసేవారు.
  • చెవి పోగులు, ఇతర ఆభరణాలు, విగ్రహాలు, బలిపీఠములు ఇతర వస్తువులు చెయ్యడానికి ఉపయోగిస్తారు.
  • పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం, లేక ఆలయంలో నిబంధన మందసం మొదలైన వాటిని చెయ్యడానికి బంగారం ఉపయోగించారు. ఇంకా వ్యాపార లావాదేవీలకు మారకాలకు వినియోగించే వారు. విలువ నిర్ణయించడానికి సున్నితపు త్రాసులో తూచే వారు.
  • తరువాత కాలంలో బంగారం, వెండి లాటి ఇతర లోహాలను వ్యాపార లావాదేవీలకోసం నాణేల ముద్రణకు ఉపయోగించారు.
  • పూర్తిగా బంగారంతో చెయ్యని వాటిని చెప్పడానికి (అంటే బంగారు తొడుగు వేసిన వాటిని) "బంగారు” లేక “బంగారం-కప్పిన” లేక “బంగారం-తాపడం చేసిన" అనే మాటలు ఉపయోగిస్తారు.
  • కొన్ని సార్లు బంగారంతో చెయ్యక పోయినా "బంగారం-రంగులో ఉన్న వస్తువులు," అంటే పసుపు, బంగారం రంగు లో ఉన్నవాటిని విలువైనవిగా ఎంచారు.

(చూడండి: బలిపీఠం, నిబంధన మందసం, అబద్ధ దేవుడు, వెండి, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1220, H1222, H1722, H2091, H2742, H3800, H4062, H5458, H6884, H6885, G5552, G5553, G5554, G5557