te_tw/bible/other/falsewitness.md

2.7 KiB

అబద్ధ సాక్షం, అబద్ధ సాక్షులు

నిర్వచనం:

"అబద్ధ సాక్షం” “తప్పు సాక్షం" అనే మాటలు ఒక వ్యక్తి గురించి గానీ సంఘటన, సాధారణంగా న్యాయ స్థానంలాంటి చోట్ల చెప్పే మాటలు.

  • "అబద్ధ సాక్షం” లేక “అబద్ధ సమాచారం" అంటే అక్షరాలా పలికిన అబద్ధం.
  • "అబద్ధ సాక్షం చెప్పడం" అంటే అబద్ధం చెప్పడం లేదా అసత్య సమాచారం ఇవ్వడం.
  • బైబిల్ ఇందుకు అనేకచోట్ల ఎవరినైనా శిక్ష పడేలా చెయ్యడం కోసం అబద్ధ సాక్షులను డబ్బిచ్చి తెచ్చుకున్న సందర్భాలను వివరిస్తున్నది.

అనువాదం సలహాలు:

  • "అబద్ధ సాక్షం చెప్పడం” లేక “అబద్ధ సాక్షం ఇవ్వడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అబద్ధ సమాచారం” లేక “ఎవరి గురించి అయినా లేనిది తెలియ పరచు” లేక “అబద్ధంగా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడు” లేక “అబద్ధం."
  • "అబద్ధ సాక్షం" ఒక వ్యక్తిని సూచిస్తున్నట్టయితే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అబద్ధికుడు” లేక “ఒక అబద్ధసాక్షి” లేక “ఎవరినైనా నిజం కానిది చెప్పే వాడు."

(చూడండి: సాక్షం, నిజం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5707, H6030, H7650, H8267, G1965, G3144, G5571, G5575, G5576, G5577