3.2 KiB
3.2 KiB
బానిసను చేయడం, బానిస, కట్టుబానిస, కట్టబడిన
నిర్వచనం:
"బానిసను చేయడం" అంటే ఎవరినైనా ఒక యజమానిని సేవించేలా బలవంతం చెయ్యడం లేదా ఒక దేశానికి సేవ చెయ్యడానికి బలవంతం చెయ్యడం. "బానిసను చేయడం" లేదా "బానిసత్వంలో" అంటే ఒకదాని ఆధీనంలో లేదా ఒకరి ఆధీనంలో ఉండడం అని అర్థం.
- ఒక వ్యక్తి బానిసగా ఉన్నప్పుడూ లేదా బానిసత్వంలో ఉన్నప్పుడూ అతడు ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఇతరులకు సేవ చేయాలి. తాను కోరుకొన్నదానిని చేయడానికి అతనికి స్వేచ్చ లేదు. "బంధకత్వం" పదానికి మరో పదం "బానిసత్వం".
- ప్రభువైన యేసు మానవులను స్వతంత్రులనుగా చేసేవరకూ వారు పాపానికి "బానిసలుగా" ఉన్నారని క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. ఒక వ్యక్తి క్రీస్తులో నూతన జీవాన్ని పొందుకొన్నప్పుడు అతడు పాపానికి బానిసగా ఉండడు, నీతికి బానిస అవుతాడు.
అనువాదం సూచనలు:
- "బానిసను చేయడం" పదం "స్వతంత్రుడిగా ఉండకుండా చెయ్యడం" లేదా "ఇతరులకు సేవ చెయ్యడానికి బలవంతం చెయ్యడం" లేదా "ఇతరుల ఆధీనంలో ఉంచడం" అని అనువదించబడవచ్చు.
- "బానిసను చేయడం" లేదా "బానిసత్వంలో" పదబంధాలు "బానిసగా ఉండడానికి బలవంతం చెయ్యడం" లేదా సేవ చేయాడానికి బలవంతం చెయ్యబడడం" లేదా "ఒకరి నియంత్రణ క్రిందకు" అని అనువదించబడవచ్చు.
(చూడండి: స్వేచ్ఛ, నీతిమంతుడు, సేవకుడు)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3533, H5647, G1398, G1402, G2615