te_tw/bible/other/earth.md

3.0 KiB

భూమి, మర్త్య, భూసంబంధమైన

నిర్వచనం:

"భూమి" అంటే ఇతర జీవులతో బాటు మానవులు నివసించే లోకం.

  • "భూమి" అంటే నేల లేక నేలను కప్పే మన్ను అని కూడా అర్థం ఇస్తుంది.
  • ఈ పదాన్ని తరచుగా భూమిపై నివసించే మనుషులకు అలంకారికంగా ఉపయోగిస్తారు. (చూడండి: అన్యాపదేశం)
  • "భూమి సంతోషించాలి” “ఆయనఅతడు భూమికి న్యాయాధిపతి" అనే మాటలు ఈ పదం అలంకారిక వాడకానికి ఉదాహరణలు.
  • "భూసంబంధమైన" అనే మాట సాధారణంగా ఆత్మ సంబంధమైన వస్తువులకు భిన్నంగా శారీరిక వస్తువులను సూచిస్తున్నది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని స్థానిక భాష లేక జాతీయ భాషలు మనం నివసించే భూమిని ఎలా పిలుస్తారో అలా కూడా అనువదించ వచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "భూమి" ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "లోకం” లేక “దేశం” లేక “మట్టి” లేక “నేల."
  • అలంకారికంగా ఉపయోగించినప్పుడు "భూమి" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భూమిపై నివసించే ప్రజలు” లేక “భూనివాసులు’ లేక “భూమిపై ఉన్న ప్రతిదీ."
  • అనువదించడం "భూసంబంధమైన" అనే దాన్ని అనువదించడంలో "భౌతిక” లేక “భూవస్తువులు” లేక “దృశ్యమైనవి.”

(చూడండి: ఆత్మ, లోకం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H127, H772, H776, H778, H2789, H3007, H3335, H6083, H7494, G1093, G1919, G2709, G2886, G3625, G3749, G4578, G5517