te_tw/bible/other/deliverer.md

5.2 KiB
Raw Permalink Blame History

విమోచించు, విమోచించుట, విమోచించబడిన, విమోచన, విమోచకుడు, విడుదల

నిర్వచనం:

"విమోచించు" అంటే ఒక మనిషిని రక్షించడం. ఈ పదం "విమోచకుడు" అంటే ఎవరినైనా మనుషుల, బానిసత్వం, పీడ, లేక ఇతర ప్రమాదాల నుండి విడిపించడం. "విమోచన" అంటే ఒకడు ఎవరినైనా మనుషుల నుండి బానిసత్వం, పీడ, లేక ఇతర ప్రమాదాల నుండి విడిపించినప్పుడు జరిగే ఫలితం.

  • పాత నిబంధనలో, దేవుడు నియమించిన విమోచకులు ఇశ్రాయేలీయులను ఇతర జాతుల దాడులకు వ్యతిరేకంగా నడిపించి విడిపించారు.
  • ఈ విమోచకులను "న్యాయాధిపతులు" అన్నారు. పాత నిబంధన న్యాయాధిపతులు గ్రంథంలో ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలును పరిపాలించిన సమయం గురించి రాసి ఉంది.
  • దేవునికి "విమోచకుడు" అని పేరు. ఇశ్రాయేలు చరిత్ర అంతటా, ఆయన తన ప్రజలను వారి శత్రువుల నుండి విమోచించాడు.
  • "అప్పగించడం” లేక “వశం చెయ్యడం" అనే వివిధ అర్థాలు ఉన్నాయి. ఎవరినైనా శత్రువు చేతికి అప్పగించదానికి ఉదాహరణ యూదులు యేసును యూదు నాయకులకు అప్పగించడం.

అనువాదం సలహాలు:

  • ప్రజలను వారి శత్రువులనుండి విడిపించడం అనే సందర్భంలో, "విమోచించు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "రక్షించు” లేక “విడుదల చేయు” లేక “విడిపించు."
  • ఎవరినైనా శత్రువుకు అప్పగించడం అనే దాన్ని అనువదించ వచ్చు "ద్రోహం చేయు” లేక “అప్పగించు” లేక “శత్రువుల పాలు చేయు."
  • ఈ పదం "విమోచకుడు" కూడా అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "రక్షించే వాడు” లేక “విడిపించే వాడు."
  • ఈ పదం"విమోచకుడు" ఇశ్రాయేలును నడిపించిన న్యాయాధిపతుల గురించి చెప్పేటప్పుడు ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "పాలకుడు” లేక “న్యాయాధిపతి” లేక “నాయకుడు."

(చూడండి: న్యాయాధిపతి, రక్షించు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 16:03 తరువాత దేవుడు ఒక విమోచకుడిని వారి శత్రువులనుండి వారిని విడిపించడానికి దేశంలో శాంతి నెలకొల్పడానికి పంపించాడు.
  • 16:16 వారు (ఇశ్రాయేలు) ఎట్టకేలకు దేవుణ్ణి మరలా సహాయం కోరి అడిగారు. దేవుడు మరొక__విమోచకుడిని__పపిచాడు.
  • 16:17 అనేక సంవత్సరాల పాటు దేవుడు అనేక మంది విమోచకులను పంపి ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి రక్షించాడు.

పదం సమాచారం:

  • Strong's: H579, H1350, H2020, H2502, H3052, H3205, H3444, H3467, H4042, H4422, H4560, H4672, H5337, H5338, H5414, H5462, H6299, H6308, H6403, H6405, H6413, H6475, H6487, H6561, H7725, H7804, H8000, H8199, H8668, G325, G525, G629, G859, G1080, G1325, G1560, G1659, G1807, G1929, G2673, G3086, G3860, G4506, G4991, G5088, G5483