4.4 KiB
4.4 KiB
మోసగించు, మోసం, మోసగాడు, మోసపూరితమైన, వంచన, భ్రమ
నిర్వచనం:
"మోసగించు" పదం నిజం కాని దేనినైనా విశ్వసించేలా చెయ్యడం అని అర్థం. ఎవరినైనా మోసం చేసే చర్యను "మోసం" లేదా "వంచన" అని పిలువబడుతుంది.
- తప్పు అయిన దానిని ఇతరులు నమ్మేలా చేసేవానిని "మోసగాడు." ఉదాహరణకు, సాతాను "మోసగాడు" అని పిలువబడ్డాడు. వాడు నియంత్రించే దురాత్మలు మోసగాళ్ళు.
- సత్యం కాని ఒక వ్యక్తి, చర్య, లేదా సందేశం మొదలైన వాటిని మోసపూరితమైనవి అని వర్ణించబడతాయి.
- "మోసం” “కపటం(వంచన)" పదాలకు ఒకే అర్థం ఉంది, అయితే అవి ఉపయోగించబడే విధానంలో కొంత స్వల్ప వ్యత్యాసం ఉంది.
- "మోసపూరితమైన," "వంచనతో కూడిన" వర్ణన పదాలకు ఒకే అర్థం ఉంది, ఒకే సందర్భంలో ఉపయోగించబడతాయి.
అనువాదం సూచనలు:
- "మోసపరచు" పదాన్ని "అబద్ధం చెప్పడం" లేదా "తప్పుడు నమ్మకం ఉండేలా చెయ్యడం" లేదా "ఒకరు సత్యం కాని దానిని నమ్మేలా చెయ్యడం" అని ఇతర విధానాలలో అనువదించబడవచ్చు.
- "మోసగించబడిన" పదం "తప్పు మాట గురించి ఆలోచించేలా చెయ్యడం" లేదా "అబద్ధం చెప్పడం" లేదా "వంచించడం" లేదా "బుద్ధిహీనునిగా చెయ్యడం" లేదా "తప్పుగా నడిపించడం" అని అనువదించబడవచ్చు.
- "మోసగాడు" పదం "అబద్ధికుడు” లేదా "తప్పుగా నడిపించువాడు" లేదా మోసం చేసేవాడు" అని అనువదించబడవచ్చు.
- సందర్భాన్ని బట్టి, "కపటం” లేక “మోసం" పదాలు "అసత్యం" లేదా "అబద్ధాలాడడం" లేదా కపటం" లేదా "అవినీతిగా ఉండడం" అని అర్థం ఇచ్చే పదాలతో అనువదించబడవచ్చు.
- "కపటమైన” లేక “మోసకరం" పదాలు ఇతరులను అసత్యమైన వాటిని విశ్వసించేలా చేసే మాటలు లేక చర్యలనూ జరిగిచే వ్యక్తిని వివరించేటప్పుడు "అసత్యమైన” లేదా "తప్పుగా నడిపించడం" లేదా "అబద్దాలాడడం" అని అనువదించవచ్చు.
(చూడండి: నిజం)
బైబిలు రిఫరెన్సులు:
- 1 యోహాను 01:08
- 1 తిమోతి 02:14
- 2 థెస్స 02:3-4
- ఆది. 03:12-13
- ఆది. 31:26-28
- లేవీ. 19:11-12
- మత్తయి 27:64
- మీకా 06:11
పదం సమాచారం:
- Strong's: H898, H2048, H3577, H3584, H4123, H4820, H4860, H5230, H5377, H6121, H6231, H6280, H6601, H7411, H7423, H7683, H7686, H7952, H8267, H8496, H8501, H8582, H8591, H8649, G538, G539, G1386, G1387, G1388, G1389, G1818, G3884, G4105, G4106, G4108, G5422, G5423