te_tw/bible/other/afflict.md

3.7 KiB

బాధ, బాధించు, బాధించ బడిన, హింస, హింసలు

నిర్వచనం:

హింసించు అనే ఈ పదం ఎవరికైనా బాధ, నొప్పి కలిగించడం అనే దానికి వాడతారు. "బాధ"అంటే వ్యాధి, మానసిక వేదన, లేక అలాటి ఫలితం కలిగించే ఇతర విషయాలు.

  • దేవుడు తన ప్రజలను వ్యాధితో, ఇతర కష్టాలతో బాధిస్తాడు. వారి పాపాల విషయం బాధపడి తన వైపుకు తిరుగుతారేమో అని ఇలాచేస్తాడు.
  • దేవుడు ఈతిబాధలు, తెగుళ్ళు ఈజిప్టు ప్రజల పైకి పంపించాడు. ఎందుకంటే వారి రాజు దేవునికి లోబడలేదు.
  • "బాధ పాలు కావడం"అంటే ఎదో ఒక రకమైన కష్టం, వ్యాధి తదితర బాధ, మానసిక దిగులు కలగడం.

అనువాదం సలహాలు:

  • బాధించడం అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఎవరినైనా కష్టాల పాలు చెయ్యడం.” లేక “ఒకరిని బాధ పెట్టడం” లేక “కష్టాలు రానియ్యడం."
  • కొన్ని సందర్భాల్లో "బాధ"ను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంభవించు” లేక “కలుగు” లేక “కష్టాలు కలిగించు."
  • "ఎవరికైనా కుష్టువ్యాధి కలిగించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కుష్టువ్యాధి వచ్చేలా చేయు."
  • మనుషులకు, జంతువులకు "బాధ" కలిగించడాన్ని చెప్పడానికి ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బాధ కలిగించు."
  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "బాధను" ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఆపద” లేక “వ్యాధి” లేక “బాధ” లేక “గొప్ప కష్టం."
  • "బాధించు"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ఫలానా దాని మూలంగా” లేక “ఫలానా వ్యాధి కలిగించు."

(చూడండి: కుష్టువ్యాధి, తెగులు, నొప్పి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H205, H1790, H3013, H3905, H3906, H4157, H4523, H6031, H6039, H6040, H6041, H6862, H6869, H6887, H7451, H7489, H7667, G2346, G2347, G2552, G2553, G2561, G3804, G4777, G4778, G5003