te_tw/bible/other/leprosy.md

3.6 KiB

కుష్టరోగి, కుష్టరోగులు, కుష్టరోగం, కుష్టుగలవాడు

నిర్వచనం:

బైబిలులో “కుష్ఠురోగం” అనే పదం అనేకవిధాలైన చర్మ వ్యాధులను సూచిస్తుంది. ఒక “కుష్టరోగి” కుష్టరోగం ఉన్నవాడు. “కుష్టరోగం ఉన్నవాడు” అనే పదం కుష్టరోగం వ్యాపించిన శరీరం లేక వ్యక్తిని వివరిస్తుంది.

  • కొన్ని రకాలైన కుష్టరోగం చర్మం తెలుపు మచ్చలతో రంగును మారుస్తుంది, మిర్యాము, నయమానులకు కుష్టరోగం వచ్చినప్పుడు ఇలానే ఉంది.
  • ఆధునికకాలంలో, కుష్టరోగం చేతులకు, కాళ్ళకు, ఇతర శరీర భాగాలకు వ్యాపించి వాటిని పాడుచేస్తుంది, అవి తమ ఆకారాన్ని కోల్పోయేలా చేస్తుంది.
  • ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన హెచ్చరికల ప్రకారం, ఒక వ్యక్తికి కుష్టరోగం వచ్చినప్పుడు అతణ్ణి “అపవిత్రుడు”గా పరిగణిస్తారు, ఇతర ప్రజలనుండి దూరంగా ఉండాలి, తద్వారా వారికి ఈ వ్యాధి సంక్రమించకుండా ఉంటుంది.
  • కుష్టరోగం వచ్చినవాడు తాను “అపవిత్రుణ్ణి” అని బిగ్గరగా అరవాలి, ఎందుకంటే ఇతరులు అతని వద్దకు రారు.
  • ప్రభువైన యేసు అనేకమంది కుష్టరోగులను బాగు చేసాడు, ఇతర రోగాలున్న వారినీ బాగుచేసాడు.

అనువాదం సూచనలు:

  • బైబిలులో “కుష్టరోగం” అనే పదాన్ని “చర్మరోగం” లేక “మరణకరమైన చర్మరోగం” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”కుష్టరోగం ఉన్నవాడు” అనే పదాన్ని “పూర్తిగా కుష్టరోగం ఉన్నవాడు” లేక “చర్మవ్యాధి సంక్రమించినవాడు” అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి: మిరియాము, నయమాను, పవిత్రం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6879, H6883, G3014, G3015