3.0 KiB
3.0 KiB
ఫిలిప్పు, సువార్తికుడు
వాస్తవాలు:
యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సంఘములో విధవరాండ్రను, పేదలను మరియు అవసరతలోనున్న క్రైస్తవులను చూచుకొనుటకు నియమింపబడిన ఏడుగురు నాయకులలో ఫిలిప్పు ఒకడైయుండెను.
- యూదా మరియు గలిలయ ప్రాంతాలలో అనేకమైన పట్టణాలలోని ప్రజలందరికి సువార్తను ప్రకటించుటకు మరియు విశేషముగా యెరూషలేమునుండి గాజాకి వెళ్ళే అరణ్యమార్గములో తను ఇథీయోపియుడైన వ్యక్తికి కూడా సువార్తను అందించుటకు దేవుడు ఉపయోగించుకొనెను.
- అనేక సంవత్సరములైన తరువాత ఫిలిప్పు కైసరయలో నివసించుచుండెను, ఇక్కడే పౌలు మరియు తన తోటివారు యెరూషలేముకు తిరిగి వచ్చు ప్రయాణములో అతని ఇంటిలోనే బస చేసియుండిరి.
- అనేకమంది బైబల్ పండితులు సువార్తీకుడైన ఫిలిప్పు మరియు ఇదే పేరుతొ ఉన్నటువంటి యేసు అపొస్తలుడు ఒకటే కాదని భావిస్తారు. కొన్ని భాషలలో వీరిద్దరిని వేరుగా చూపించుటకు మరియు స్పష్టత కొరకు ఈ ఇద్దరి పేర్లను విభిన్నమైన అక్షరాలను ఉపయోగించి ఉచ్చరించడానికి ప్రాధాన్యతనిస్తుంటారు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చుడండి: ఫిలిప్పు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- అపొ.కార్య.06:5-6
- అపొ.కార్య.08:6-8
- అపొ.కార్య.08:12-13
- అపొ.కార్య.08:29-31
- అపొ.కార్య.08:36-38
- అపొ.కార్య.08:39-40
పదం సమాచారం:
- Strong's: G5376