2.2 KiB
2.2 KiB
బాషాను
వాస్తవాలు:
బాషాను గలిలీ సరస్సు తూర్పున ఉన్న ప్రాంతం. ప్రస్తుతం ఇది సిరియా, గోలాను మెరక ప్రదేశాల ప్రాంతం.
- ఒక పాత నిబంధన ఆశ్రయ పట్టణం పేరు "గోలాను" ఇది బాషాను ప్రాంతంలో ఉంది.
- బాషాను చాలా సారవంతం ప్రాంతం. అక్కడి సిందూర వృక్షాలు, పశువుల మేత భూములు ఎంతో ప్రసిద్ధికెక్కాయి.
- ఆది 14 లో బాషాను అనేక రాజులు, వారి జాతుల మధ్య ఒక యుద్ధం జరిగిన ప్రాంతం.
- ఇశ్రాయేలీయుల ఈజిప్టునుండి తప్పించుకున్న తరువాత ఎడారి ప్రాంతంలో వారు తిరుగులాడిన సమయంలో వారు బాషానులో కొంత భాగం ఆక్రమించుకున్నారు.
- అనేక సంవత్సరాలు తరువాత, సొలోమోను రాజు ఈ ప్రాంతం నుండి తనకోసం సరుకులు తెప్పించుకున్నాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఈజిప్టు, సిందూర వృక్షం, గలిలీ సరస్సు, సిరియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1316