te_tw/bible/other/oak.md

3.0 KiB

సింధూర వృక్షం, సింధూర వృక్షములు

నిర్వచనం

ఒక సింధూర వృక్షం పొడవుగా ఉండే చెట్టు, వెడల్పైన మ్రాను ఉంటుంది, కొమ్మలు విస్తరించి ఉంటాయి.

  • సింధూర వృక్షానికి దృఢమైన, బలమైన కలప ఉంటుంది, ఓడలు కట్టడంలో వినియోగిస్తారు, వ్యవసాయ నాగలి, ఎడ్ల కాడి, నడిచే కర్రలు తాయారు చెయ్యడంలో దీనిని వినియోగిస్తారు.
  • సింధూర చెట్టు విత్తనాన్ని సింధూర ఫలం అంటారు.
  • కొన్ని సింధూర చెట్ల మ్రానులు 6 మీటర్ల చుట్టు కొలత ఉంటుంది.
  • సింధూర వృక్షాలు దీర్ఘాయుష్షుకు గుర్తుగా ఉంటాయి, వీటికి ఇతర ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. బైబిలు గ్రంథంలో అవి తరుచుగా పరిశుద్ధ స్థలాలతో సంబంధ పరచబడ్డాయి.

అనువాదం సూచనలు:

  • అనేక అనువాదాలు కేవలం “సింధూరం” అనే పదాన్ని వినియోగించడం కంటే “సింధూర వృక్షం” అనే మాటను వినియోగించడానికి ప్రాముఖ్యతని ఇచ్చాయి.
  • సింధూర వృక్షాలను గురించి అర్థం కాని ప్రాంతంలో, “సింధూర వృక్షం” అనే పదాన్ని “.....వంటి పెద్ద నీడనిచ్చే సింధూర వృక్షం” అని అనువదించవచ్చు, తరువాత స్థానికంగా అటువంటి లక్షణాలు కలిగిన వృక్షం పేరు పెట్టవచ్చు.
  • చూడండి: తెలియని పదాలను అనువదించడం

(చూడండి: పరిశుద్దత)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H352, H424, H427, H436, H437, H438