te_tw/bible/names/annas.md

2.1 KiB

అన్న

వాస్తవాలు:

అన్న యెరూషలేములో 10 సంవత్సరాలపాటు యూదు ప్రధాన యాజకుడు. క్రీ. శ. 6 నుండి దాదాపు 15 వరకు ఈ పదవిలో ఉన్నాడు. రోమా ప్రభుత్వం అతణ్ణి ప్రధాన యాజకత్వం నుండి తొలగించింది. అయినా అతడు యూదుల మధ్య ప్రభావం గల నాయకుడుగా కొనసాగాడు.

  • అన్న అధికార ప్రధాన యాజకుడు కయపకు మామగారు. యేసు పరిచర్య కాలంలో యితడు ఉన్నాడు.
  • ప్రధాన యాజకులు పదవీవిరమణ చేశాక, వారు ఆ బిరుదు నామం ఉంచుకుంటారు. దానితో బాటు పదవి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి కయప, ఇతరులు యాజకత్వంలో ఉన్నప్పటికీ, అన్నను ప్రధాన యాజకుడు అనడం కొనసాగుతుంది.
  • యూదు నాయకుల ఎదుట యేసు న్యాయ విచారణ సమయంలో ఆయన్ని మొదటిగా ప్రశ్నించడానికి అన్న దగ్గరకు తీసుకువచ్చారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ప్రధాన యాజకుడు, యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G452