te_tw/bible/names/amaziah.md

2.4 KiB
Raw Permalink Blame History

అమజ్యా

వాస్తవాలు:

అమజ్యా తన తండ్రి యోవాషు రాజు హత్యకు గురి అయిన తరువాత యూదా రాజ్యంపై రాజయ్యాడు.

  • అమజ్యా రాజు ఇరవైతొమ్మిది సంవత్సరాలు, అంటే క్రీ. పూ 796నుడి క్రీ. పూ. 767వరకు యూదాను పరిపాలించాడు.
  • అతడు మంచి రాజు, అయితే విగ్రహారాధక ఉన్నత స్థలాలను అతడు నాశనం చేయలేదు.
  • అమజ్యా ఎట్టకేలకు తన తండ్రి హత్యకు బాధ్యులైన వారందరికి మరణశిక్ష విధించాడు.
  • తిరుగుబాటు చేసిన ఎదోమీయులను అతడు ఓడించి వారిని యూదా రాజ్యం కిందకు తెచ్చాడు.
  • అతడు ఇశ్రాయేలు రాజు ఎహోయాషును సమరానికి పిలిచాడు, కానీ ఓడిపోయాడు. యెరూషలేము ప్రాకారంలో కొంత భాగం కూలిపోయాయి. ఆలయంలోని వెండి, బంగారం పాత్రలు శత్రువులు దోచుకున్నారు.
  • సంవత్సరాలు తరువాత అమజ్యా రాజు యెహోవా నుండి తొలగి పోయాడు. యెరూషలేములో కొందరు మనుషులు అతనిపై కుట్ర చేసి, అతణ్ణి చంపాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: యోవాషు, ఎదోము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H558