te_tw/bible/kt/rabbi.md

2.9 KiB

రబ్బీ

నిర్వచనము:

“రబ్బీ” అను పదము అక్షరార్థముగా “నా యజమానుడు” లేక “నా బోధకుడు” అని అర్థము.

  • ఇది యూదుల మత బోధకుడిని సూచించుటకు ఉపయోగించబడిన గౌరవపూర్వకమైన పదమునైయున్నది, విశేషముగా దేవుని ధర్మశాస్త్ర బోధకుని పిలిచెదరు.
  • బాప్తిస్మమిచ్చు యోహానును మరియు యేసును కొన్నిమార్లు వారి శిష్యులు ద్వారా “రబ్బీ” అని పిలువబడిరి.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును తర్జుమా చేయు విధానములో “నా యజమానుడు” లేక “నా బోధకుడు” లేక “గౌరవ ఉపాధ్యాయుడు” లేక “మత బోధకుడు” అనే మాటలను ఉపయోగిస్తారు. కొన్ని భాషలలో ఈ విధముగా అక్షరాలను పెద్దవిగా చేసి ఉపయోగిస్తారు, మరికొన్ని భాషలలో ఈ విధముగా ఉపయోగించరు.
  • తర్జుమా చేయు భాషలో బహుశః బోధకులని ఆ విధముగా సూచించి చెప్పే ప్రత్యెక విధానము ఉండకపోవచ్చు.
  • తర్జుమా చేసిన ఈ పదము యేసు ఒక పాఠశాల ఉపాధ్యాయుడనే అర్థము రాకుండా జాగ్రత్తపడండి.
  • “రబ్బీ” అనే పదము పరిశుద్ధ గ్రంథములోను మరియు జాతీయ లేక అనువాద భాషలో ఏ విధముగా అనువదించబడిందో ఒకసారి చూడండి.

(చూడండి: తెలియని వాటిని ఏ విధముగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: బోధకుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4461