te_tw/bible/kt/predestine.md

3.4 KiB

ముందుగా నిర్ణయించబడుట, ముందుగా నిర్ణయించబడినది

నిర్వచనము:

“ముందుగా నిర్ణయించుట” మరియు “ముందుగా నిర్ణయించబడుట” అనే పదములు ఏదైనా కార్యము జరుగక మునుపే ప్రణాళికవేయుట లేక నిర్ణయించుటను సూచిస్తుంది.

  • ఈ పదము ప్రత్యేకముగా నిత్యజీవమును పొందుకొనుటకు దేవుడు ప్రజలను ముందుగానే నిర్ణయించియున్నాడని సూచిస్తుంది.
  • కొన్నిమార్లు “ముందుగా నియమించుట” అనే పదము కూడా ఉపయోగించబడినది, ఈ మాటకు కూడా ఏదైనా కార్యము జరుగక మునుపే నిర్ణయించుట అని అర్థము కలదు.

తర్జుమా సలహాలు:

  • “ముందుగా నిర్ణయించబడుట” అనే ఈ మాటను “ముందుగానే తీర్మానించుట” లేక “రానున్న సమయాన్ని లేక విధిని ముందుగా తీర్మానించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ముందుగా నిర్ణయించబడెను” అనే ఈ మాటను “ఎంతో కాలము క్రితమే నిర్ణయించబడియుండుట” లేక “రానున్న సమయాన్ని లేక విధిని ప్రణాళిక చేయుట” లేక “ఏదైనా కార్యము జరుగక మునుపే తీర్మానము చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “మనము ముందుగానే నిర్ణయించబడియున్నాము” అనేటువంటి వ్యాఖ్యను “మనము ఇలా ఉండాలని ఎంతో కాలము క్రితమే తీర్మానించబడియున్నాము” లేక “రానున్న కాలములో మను ఇలా ఉండాలని మనమిప్పటికే నిర్ణయించబడియున్నాము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదము యొక్క తర్జుమా “ముందుగా తెలిసికొనియుండుట” అను మాటకు విభిన్నముగా ఉండునట్లు చూచుకొనవలెనని సూచన.

(ఈ పదములను కూడా చూడండి: ముందుగా తెలిసికొనియుండుట)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4309