te_tw/bible/kt/lordssupper.md

2.7 KiB

ప్రభురాత్రి భోజనం

నిర్వచనం:

అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన “ప్రభురాత్రి భోజనం” అనే పదం యూదా నాయకులు యేసును పట్టుకొన్న రాత్రి ఆయన తన శిష్యులతో భుజించిన పస్కా భోజనాన్ని సూచిస్తుంది.

  • ఈ భోజన సమయంలో యేసు పస్కారొట్టెను విరిచి అది త్వరలో కొట్టబడి చనిపోబోతున్న తన శరీరం అని చెప్పాడు.
  • ద్రాక్షరస పాత్రను ఆయన తన రక్తం అని చెప్పాడు. పాపం కోసం బలిగా చనిపోతుండగా త్వరలో చిందింపబడబోతున్నదని చెప్పాడు.
  • తన శిష్యులు కలిసి ఈ భోజనాన్ని చేస్తున్న ప్రతీసారి ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు.
  • యేసులో విశ్వాసుల కోసం ప్రభురాత్రి భోజనం ఒక క్రమమైన ఆభ్యాసంగా ఉండాలని కొరింథియులకు రాసిన చివరి పత్రికలో పౌలు మరింత స్థిరపరచాడు.
  • ఈ రోజున సంఘాలు తరుచుగా వినియోగిస్తున్న “ప్రభు సంస్కారం” అంటే ప్రభురాత్రిభోజనం అని అర్థం. “చివరి భోజనం” అని కూడా కొన్ని సార్లు వినియోగించారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం “ప్రభువు భోజనం” లేక “మన ప్రభువైన యేసు భోజనం” లేక “ప్రభువైన యేసు జ్ఞాపకార్ధ భోజనం” అని అనువదించవచ్చు.

(చూడండి: పస్కా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1173, G2960