te_tw/bible/kt/jealous.md

3.3 KiB

ఈర్ష్య, రోషం

నిర్వచనం:

“ఈర్ష్య” “రోషం” అంటే బలంగా తనకు సంబంధించిన వారితో పవిత్రమైన బంధాన్ని కోరుకోవడం. బలమైన రీతిలో ఎవరి ఆస్తిని, మరి దేనిని గానీ ఆశించడం.

  • ఈ పదాల తరచుగా కోపం, ఉక్రోషం మొదలైన వాటికి ఉపయోగిస్తారు. తన భార్య/భర్త వారి వివాహబంధంలో ద్రోహం చేసినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ఉద్రేకం.
  • బైబిల్లో ఉపయోగించినప్పుడు ఈ పదాలు తరచుగా తన ప్రజలు పాపం మరక అంటకుండా వారు శుద్ధులుగా ఉండాలనే దేవుని బలమైన ఆకాంక్ష తెలియజేస్తున్నాయి.
  • దేవునికి తన నామం విషయంలో "రోషం" ఉంది. దానిని ప్రతిష్టపూర్వకంగా మన్ననతో పలకాలి.
  • ఎవరైనా జయం పొంది, తనకన్నా ప్రఖ్యాతిగాంచితే కలిగే ఈర్ష్య దీని మరొక అర్థం. ఇది "అసూయ” కు దగ్గరగా ఉంటుంది.

అనువాదం సలహాలు:

  • "రోషం" అనువదించడం. "తనకే కట్టుబడి ఉండాలనే బలమైన కోరిక” లేక “నాకే స్వంతం అనే ఆకాంక్ష."
  • "అసూయ పడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బలమైన ఈర్ష్యాసూయలు” లేక “నా స్వంతం అనే ఆలోచన."
  • దేవుణ్ణి గురించి చెప్పేటప్పుడు ఈ పదం అనువాదం నెగెటివ్ అర్థం రాకుండా చూడండి.
  • ఇతరులు గెలిస్తే మనుషులకు కోపం రావడం మొదలైన తప్పు భావాలు వ్యక్తపరిచే సందర్భంలో “ఈర్ష్య” “అసూయ" ఉపయోగిస్తారు. అయితే ఈ పదాలను దేవునికి వాడకూడదు.

(చూడండి: అసూయ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7065, H7067, H7068, H7072, G2205, G3863