te_tw/bible/kt/daughterofzion.md

2.6 KiB

సియోను కుమార్తె

నిర్వచనం:

"సియోను కుమార్తె" అంటే అలంకారికంగా ఇశ్రాయేలు ప్రజలు అని అర్థం. దీన్ని సాధారణంగా ప్రవచనాలలో ఉపయోగిస్తారు.

  • పాత నిబంధనలో, "సియోను" అనే పేరును యెరూషలేము పట్టణాన్నినికి మరొక పేరుగా తరచుగా ఉపయోగిస్తారు.
  • ఇశ్రాయేలును సూచించడానికి "సియోను” “యెరూషలేము" రెంటిని ఉపయోగిస్తారు.
  • ఈ పదం "కుమార్తె" అనేది ఆప్యాయత సూచించే పదం. రూపకాలంకారంగా తన ప్రజల పట్ల దేవుని సహనం, శ్రద్ధలను సూచించడం కోసం దీన్ని వాడతారు.

అనువాదం సలహాలు:

  • అనువదించడంలోని పద్ధతులు "సీయోను నుండి నా కుమార్తె ఇశ్రాయేలు,” లేక “నా కుమార్తె వంటి సియోను ప్రజలు” లేక “సియోను, నా ప్రియ ఇశ్రాయేలు ప్రజ."
  • ఈ పదం "సియోను" అనే మాటను బైబిల్లో చాలా సార్లు ఉపయోగించారు గనక ఇలానే వాడడం మంచిది. అనువాదంలో దీని అలంకారిక, ప్రవచనాత్మక అర్థాల వివరణ ఇస్తే మంచిది.
  • ‘కుమార్తె" అనే పదాన్ని చదివే వారు సరిగా అర్థం చేసుకుంటారు అనుకుంటే అనువాదంలో అలానే ఉంచితే మంచిది.

(చూడండి: యెరూషలేము, ప్రవక్త, సియోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1323, H6726