te_tw/bible/kt/boast.md

4.4 KiB

డంబం, డంబాలు, డంబాలు పలుకు

నిర్వచనం:

ఈ పదం "డంబాలు"అంటే దేన్నైనా, ఎవరినైనా ఉద్దేశించి గర్వం మాటలు పలకడం. దీని అర్థం తరచుగా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం.

  • "డంబాలు పలుకు"వాడు తన గురించి గర్వంగా మాట్లాడతాడు.
  • ఇశ్రాయేలీయులు వారి విగ్రహాల గురించి "డంబాలు చెప్పుకుంటున్నందుకు" దేవుడు వారిని గద్దించాడు. వారు నిజ దేవుని స్థానంలో అహంకారంగా అబద్ధ దేవుళ్ళను ఆరాధించారు.
  • ప్రజలు వారి సంపద, వారి బలం, వారి సారవంతమైన భూములు, వారి చట్టాలు గురించి డంబాలు పలకడం గురించి బైబిల్ చెబుతున్నది. అంటే వారు ఈ విషయాల గురించి గర్వంగా మాట్లాడుతూ వాటన్నిటినీ ఇచ్చింది దేవుడేనని గుర్తించడం లేదు.
  • దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. ఇలాటి "అతిశయాలు," గర్వం మాటలు అయన తమకు తెలుసు అనే దాన్ని బట్టి వారు పలకాలి.
  • అపోస్తలుడు పౌలు కూడా ప్రభువులో అతిశయించాలని చెబుతున్నాడు. అంటే దేవుడు వారికి చేసిన దానంతటిని బట్టి వారు సంతోషంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి.

అనువాదం సలహాలు:

  • "డంబాలు"అనే దాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "డప్పాలు” లేక “గర్వపు మాటలు” లేక “గర్వంగా ఉండడం."
  • ఈ పదం "డంబాలు పలుకు"అనే మాటను ఒక పదం లేక పదబంధం తో అనువదించడం ఎలా అంటే "గర్విష్టి మాటలతో నిండిపోయి” లేక “అహంభావం” లేక “తన గురించి గర్వంగా మాట్లాడడం."
  • దేవుణ్ణి గురించి ఎరిగినందువల్ల అతిశయించే సందర్భంలో దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గర్వపడు” లేక “ఆనందించు” లేక “దాన్ని బట్టి ఎంతో ఆనందించి” లేక “దాని విషయం దేవునికి కృతఙ్ఞతలు చెప్పి."
  • కొన్ని భాషల్లో నకారాత్మకమైన గర్వానికి, మంచి గర్వానికి వేరు వేరు మాటలు ఉంటాయి. ఉదాహరణకు ఒకటి అహంకారి. రెండవది అనుకూల పదం. తన కుటుంబం, పని, దేశం గురించి గర్వంగా భావించడం.

అనువాదం సలహాలు:

(చూడండి: గర్వం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1984, H3235, H6286, G212, G213, G2620, G2744, G2745, G2746, G3166