te_tw/bible/kt/blasphemy.md

3.3 KiB

దైవ దూషణ, దూషించు, దైవ దూషణ చేసిన, దైవ దూషణకరమైన, దైవ దూషణలు

నిర్వచనం:

బైబిల్లో ఈ పదం "దైవ దూషణ" ను దేవుని పట్ల తీవ్రమైన అమర్యాదపూర్వకంగా మాట్లాడడాన్ని సూచించడానికి వాడతారు. " దూషించు" అంటే ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడి ఆ వ్యక్తి గురించి ఇతరులకు చెడు అభిప్రాయం కలిగేలా చెయ్యడం.

  • తరచుగా, దూషణ చేయడం అంటే దుర్భాషలాడడం, లేక ఒక వ్యక్తి గురించి అసత్యాలు పలికి అవమానించడం, లేక అతని ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం.
  • మనిషి తాను దేవుడినని చెప్పుకోవడం, లేక నిజ దేవుడు కాక వేరే దేవుళ్ళు ఉన్నారని చెప్పడం దైవ దూషణ కిందికే వస్తుంది.
  • కొన్ని అంగ్ల అనువాదాలు ఈ పదాన్ని మనుషుల విషయంలో వాడినప్పుడు "దుర్భాషలు" అని తర్జుమా చేసాయి.

అనువాదం సలహాలు:

  • "దైవ దూషణ చేయి" అనే పదాన్ని "దేవునికి వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలుకు” లేక “దేవునికి అప్రతిష్ట కలిగించు” లేక “దుర్భాషలాడు" అని తర్జుమా చేయ వచ్చు.
  • దీన్నిఅనువదించే మార్గాలు. "దైవ దూషణ" అనే పదంలో "ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం” లేక “దుర్భాషలాడడం” లేక “చెడు వార్తలు ప్రచారం చెయ్యడం."

(చూడండి: అప్రతిష్ట , దుర్భాషలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1288, H1442, H2778, H5006, H5007, H5344, G987, G988, G989