te_tw/bible/kt/atonementlid.md

3.3 KiB

ప్రాయశ్చిత్తం మూత

నిర్వచనం:

"ప్రాయశ్చిత్తం మూత"అంటే నిబంధన మందసాన్ని కప్పే బంగారపు పై మూత. అనేక ఇంగ్లీషు అనువాదాల్లో దీన్ని "ప్రాయశ్చిత్తం మూత" అని కూడా అంటారు.

  • ప్రాయశ్చిత్తం మూత 115 సెంటిమీటర్లు పొడవు 70 సెంటిమీటర్లు వెడల్పు.
  • ప్రాయశ్చిత్తం మూతపై రెండు బంగారం కెరూబులు వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ నిలిచి ఉంటాయి.
  • మూతపై చాచిన కెరూబుల రెక్కల మధ్యనుంచి తాను ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కోసం వారిని కలుసుకుంటాయనని యెహోవా చెప్పాడు. ప్రధాన యాజకుడు మాత్రమే ప్రజల ప్రతినిధిగా యెహోవాను కలుసుకోగలుగుతాడు.
  • కొన్ని సార్లు ప్రాయశ్చిత్తం మూతను "కరుణా పీఠం"అన్నారు. ఎందుకంటే అది పాపపూరితమైన మానవులను విమోచించడం కోసం దిగివచ్చిన దేవుని కరుణను చాటుతున్నది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని తర్జుమా చేయడంలో ఇతర పద్ధతులు. "దేవుడు వాగ్దానం చేసిన విమోచన సూచన అయిన మందసం మూత” లేక “దేవుడు ప్రాయశ్చిత్తం చేసే స్థలం” లేక “దేవుడు క్షమించి తిరిగి పూర్వ స్థితి కలిగించే స్థలం అయిన మందసం మూత."
  • దీన్ని "పరిహారం చేసే స్థలం" అని కూడా అనవచ్చు.
  • ఈ పదాన్ని అనువదించే మార్గాలు "ప్రాయశ్చిత్తం,""పరిహారం,” “విమోచన."

(చూడండి: నిబంధన మందసం, ప్రాయశ్చిత్తం, కెరూబులు, పరిహారం, విమోచించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3727, G2435