te_tn/te_tn_53-1TH.tsv

209 lines
93 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
1TH front intro jp2y 0 # 1 థెస్సలొనీకయులకు పత్రిక పరిచయం

## భాగ1: సాధారణ పరిచయం

### 1 థెస్సలోనీకయుల పుస్తకం యొక్క గ్రంధ విభజన

1. శుభములు (1: 1)
1. థెస్సలోనికయ క్రైస్తవుల కొరకు కృతజ్ఞతా ప్రార్థన (1: 2-10)
1. థెస్సలోనికయలో పౌలు పరిచర్య (2: 1-16)
1. వారి ఆధ్యాత్మిక వృద్ధి విషయమై పౌలు భారములు
- తల్లివలే (2: 7)
- తండ్రివలే (2:11)
1. పౌలు తిమోతిని థెస్సలొనీకయకు పంపుతాడు మరియు తిమోతి పౌలుకు తిరిగి నివేదించాడు (3: 1-13)
1. ఆచరణాత్మక సూచనలు
- దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవించుట (4: 1-12)
- మరణించినవారి విషయమైన ఆదరణ (4: 12-18)
- క్రీస్తు తిరిగి రాకడ దైవిక జీవనానికి ఒక ప్రేరణ (5: 1-11)
1 . ముగింపు ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు మరియు ప్రార్థనలు (5: 12-28)

### 1 థెస్సలొనీకయులకు పత్రిక ఎవరు వ్రాసారు?

1 థెస్సలొనీకయులకు పత్రిక పౌలు వ్రాశాడు. పౌలు తార్సు నగరానికి చెందినవాడు. అతను తన ప్రారంభ జీవితంలో సౌలు అని పేరొందినవాడు. క్రైస్తవుడు కావడానికి ముందు పౌలు పరిసయ్యుడు. అతను క్రైస్తవులను హింసించాడు. అతను క్రైస్తవుడైన తరువాత, యేసును గురించి ప్రజలకు చెప్పడానికి అతను రోమా సామ్రాజ్యం అంతటా చాలాసార్లు ప్రయాణించాడు.

కొరింథు నగరంలో ఉంటున్నప్పుడు పౌలు ఈ లేఖ రాశాడు. పౌలు బైబిల్లో ఉన్న అన్ని లేఖలలో, చాలా మంది పండితులు 1 థెస్సలొనీకయులకు పత్రిక పౌలు రాసిన మొదటి లేఖ అని అభిప్రాయపడుతున్నారు.

### 1 థెస్సలొనీకయుల పత్రిక ఎందుకు వ్రాయబడింది? ? ?

పౌలు థెస్సలోనీక నగరంలోని విశ్వాసులకు ఈ లేఖ రాశాడు. నగరంలోని యూదులు అతనిని బలవంతంగా వెళ్ళగొట్టిన తర్వాత ఆయన దీనిని రాశారు. ఈ లేఖలో అతను బలవంతంగా వెళ్ళగొట్టబడినప్పటికీ, అతని సందర్శన విజయవంతం అయినట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

థెస్సలొనీక విశ్వాసుల గురించి తిమోతి నుండి వచ్చిన సమాచారానికి పౌలు స్పందించాడు. అక్కడి విశ్వాసులు హింసించబడ్డారు. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడాన్ని కొనసాగించమని ఆయన వారిని ప్రోత్సహించాడు. క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయినవారికి ఏమి జరుగుతుందో వివరిస్తూ ఆయన వారిని ఆదరించాడు.

### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించవచ్చు?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ""1 థెస్సలొనీకయులకు"" లేదా ""మొదటి థెస్సలొనీకయులకు"" అని పిలువడాన్ని ఎంచుకోవచ్చు. వారు అందుకు బదులుగా ""థెస్సలొనికయలోని సంఘానికి పౌలు యొక్క మొదటి పత్రిక"" లేదా ""థెస్సలొనికయలోని క్రైస్తవులకు మొదటి పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవడానికి కోరవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

### యేసు యొక్క ""రెండవ రాకడ"" అనగా ఏమిటి?

యేసు చివరికి భూమికి తిరిగి రావడం గురించి పౌలు ఈ లేఖలో ఎక్కువగా రాశాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు, అతను మానవాళినంతటిని తీర్పు తీర్చుతాడు. . అతను సృష్టిని కూడా పరిపాలిస్తాడు, ప్రతిచోటా శాంతి ఉంటుంది.

### క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారికి ఏమి జరుగుతుంది?

t క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారు తిరిగి జీవించి యేసుతోఉంటారని పౌలు స్పష్టం చేశాడు. వారు ఎప్పటికీ మృతులుగానే ఉండరు. థెస్సలొనీకయులను ప్రోత్సహించడానికి పౌలు దీనిని రాశాడు. ఎందుకనగా వారిలో కొందరు మరణించిన వారు యేసు తిరిగి వచ్చే ఆ గొప్ప రోజును కోల్పోతారని భయపడ్డారు.

## భాగం 3: ముఖ్యమైన తర్జుమా సమస్యలు

### ""క్రీస్తులో"" మరియు ""ప్రభువులో"" వంటి వ్యక్తీకరణల విషయంలో పౌలు అర్థం ఏమిటి?

క్రీస్తుతో మరియు విశ్వాసులతో చాలా సన్నిహిత సహవాస భావనను వ్యక్తపరచడమే ఇక్కడ పౌలు ఉద్దేశ్యం. ఈ రకమైన వ్యక్తీకరణ గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి రోమా పత్రిక పరిచయాన్ని చూడండి.

### 1 థెస్సలొనీకయుల పత్రిక యొక్క వచనాలలోని ప్రధాన సమస్యలు ఏమిటి?

కింది వచనాల విషయంలో, బైబిల్ యొక్క నవీన తర్జుమాలు పాత తర్జుమాలకు భిన్నంగా ఉన్నాయి. ULT వచనం పాత పఠనాన్ని ఫుట్‌నోట్‌లో ఉంచుతూ ఆధునిక పఠనాన్ని కలిగి ఉంది. బైబిల్ యొక్క అనువాదం సాధారణ బాగంలో ఉంటే, అనువాదకులు ఆ తర్జుమాల్లో కనిపించే పఠనాన్ని ఉపయోగించడాన్ని పరిగణించాలి. కానిపక్షంలో, అనువాదకులు ఆధునిక పఠనాన్ని అనుసరించమని సలహా ఇవ్వబడుచున్నది.

* “కృప మరియు శాంతి మీకు కలుగు గాక"" (1: 1). కొన్ని పాత తర్జుమాలు చదవండి: ""మన తండ్రి అయిన దేవుని నుండియు మరియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృప మరియు శాంతి కలుగును గాక.""
* ""బదులుగా, పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు తల్లిలాగే మేము మీతో మృదువుగా వ్యవహరించాం."" (2: 7) ఇతర ఆధునిక సంస్కరణలు మరియు పాత సంస్కరణలు ఇలా ఉన్నాయి, ""బదులుగా, ఒక తల్లి తన పిల్లలను ఓదార్చునట్లు మేము మీ మధ్య శిశువులలాగా ఉన్నాము.""
* "" మన సోదరుడు మరియు క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడు అయిన తిమోతి"" (3: 2 ). ఇతర తర్జుమాలు ఇలా ఉన్నాయి: ""మన సోదరుడు మరియు దేవుని సేవకుడు అయిన తిమోతి.""

(చూడండి: [[rc://te/ta/man/translate/translate-textvariants]])
1TH 1 intro y8c5 0 # 1 థెస్సలొనీకయులు 01 సాధారణ గమనికలు

## నిర్మాణం మరియు ఆకృతీకరణ

వచనం 1 అధికారికంగా ఈ లేఖను పరిచయం చేస్తుంది. పురాతన సమీప తూర్పు ప్రాంతంలోని ఉత్తరాలలో సాధారణంగా ఈ రకమైన పరిచయాలు ఉంటాయి.

## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

### కష్టాలు
థెస్సలొనీకాలో క్రైస్తవులను ఇతర వ్యక్తులు హింసించారు. కానీ అక్కడి క్రైస్తవులు దానిని చక్కగా నిర్వహించగలిగారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 1 1 dp37 0 General Information: పౌలు తనను తాను పత్రిక రాసిన వ్యక్తిగా పేర్కొంటూ థెస్సలొనీకాలోని సంఘానికి శుభములుతెలియజేస్తున్నాడు.
1TH 1 1 ms5e figs-explicit Παῦλος, καὶ Σιλουανὸς, καὶ Τιμόθεος; τῇ ἐκκλησίᾳ 1 Paul, Silvanus, and Timothy to the church ఈ లేఖ రాసినది పౌలే అని UST స్పష్టం చేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 1 1 luw5 figs-metonymy χάρις ὑμῖν καὶ εἰρήνη 1 May grace and peace be to you కృప"" మరియు ""శాంతి"" అనే పదాలు ప్రజల పట్ల దయతో మరియు శాంతియుతంగా వ్యవహరించే వ్యక్తికి ఉపయోగించే ఉపమానాలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ పట్ల దయ చూపి మీకు శాంతిని ఇస్తాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 1 1 nn67 figs-you εἰρήνη 1 peace be to you “మీకు” అనే పదం థెస్సలొనీక విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-you]])
1TH 1 2 y98w figs-exclusive 0 General Information: ఈ లేఖలో ""మేము"" మరియు ""మాకు"" అనే పదాలు పౌలు, సిల్వాను మరియు తిమోతిలను సూచిస్తాయి. అలాగే, బహువచనంలో వాడబడిన ""మీరు"" అనే పదం మరియు థెస్సలొనీకయ సంఘ విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])
1TH 1 2 xud4 εὐχαριστοῦμεν τῷ Θεῷ πάντοτε 1 We always give thanks to God పౌలు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, థెస్సలొనీకయులను తన ప్రార్థనలలో దేవునికి నిరంతరం సమర్పిస్తాడని ఇక్కడ వాడబడిన ""ఎల్లప్పుడూ"" అనే పదం సూచిస్తుంది.
1TH 1 2 r3yd μνείαν ποιούμενοι ἐπὶ τῶν προσευχῶν ἡμῶν, ἀδιαλείπτως 1 we mention you continually in our prayers ఎప్పుడూ మీకోసం ప్రార్ధిస్తూ ఉన్నాము.
1TH 1 3 bl7l τοῦ ἔργου τῆς πίστεως 1 work of faith దేవునిలో ఉన్న నమ్మకాన్ని బట్టి కార్యాలు జరిగాయి.
1TH 1 4 xky4 0 Connecting Statement: పౌలు థెస్సలొనీకా వద్ద విశ్వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు మరియు దేవునిపై విశ్వాసం ఉంచినందుకు వారిని ప్రశంసిస్తున్నాడు.
1TH 1 4 erb6 ἀδελφοὶ 1 Brothers ఇక్కడ పురుషులు మరియు స్త్రీలను కలుపుకొని తోటి క్రైస్తవులు అని భావము.
1TH 1 4 u5er figs-exclusive εἰδότες 1 we know “మేము” అనే మాట థెస్సలొనీక విశ్వానులను కాక పౌలును, సిల్వానును, మరియు తిమోతిని సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
1TH 1 5 ude4 οὐκ…ἐν λόγῳ μόνον 1 not in word only మేము చెప్పినవాటిలో మాత్రమే కాదు
1TH 1 5 h675 ἀλλὰ καὶ ἐν δυνάμει, καὶ ἐν Πνεύματι Ἁγίῳ 1 but also in power, in the Holy Spirit సాధ్యమయ్యే అర్ధాలు 1) పరిశుద్ధాత్మ పౌలుకు మరియు అతని సహచరులకు సువార్తను శక్తివంతంగా బోధించే సామర్థ్యాన్ని ఇచ్చాడు లేదా 2) పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ప్రకటనను థెస్సలొనీకయ విశ్వాసులలో శక్తివంతమైన ప్రభావాన్ని కలిగించేలా చేశాడు లేదా 3) పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యాల ద్వారా సువార్త ప్రకటన సత్యాన్ని ప్రదర్శించాడు.
1TH 1 5 t1w3 figs-abstractnouns καὶ πληροφορίᾳ πολλῇ 1 in much assurance నైరూప్య నామవాచకం ‘నిశ్చయత"" ను క్రియగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది సత్యమని దేవుడు మీకు నిర్ధారించాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
1TH 1 5 e889 οἷοι 1 what kind of men మీమధ్య ఉన్నప్పుడు మేమెలా ప్రవర్తించామో
1TH 1 6 cs49 καὶ ὑμεῖς μιμηταὶ…ἐγενήθητε 1 You became imitators “అనుకరించడం” అనగా ఇతరులవలే ప్రవర్తించుట లేదా ఇతరుల ప్రవర్తనను అనుసరించుట
1TH 1 6 cl6r δεξάμενοι τὸν λόγον 1 received the word సందేశాన్ని ఆహ్వానించారు లేదా “మేము చెప్పవలసిన దానిని అంగీకరించారు”
1TH 1 6 q4gm ἐν θλίψει πολλῇ 1 in much hardship తీవ్ర బాధలు కలిగిన సమయంలో లేదా “తీవ్ర హింసలలో”
1TH 1 7 ml7u translate-names ἐν τῇ Ἀχαΐᾳ 1 Achaia ప్రస్తుత గ్రీస్‌లో ఉన్న పురాతన జిల్లా ఇది. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
1TH 1 8 qyk6 figs-metonymy ὁ λόγος τοῦ Κυρίου 1 the word of the Lord ఇక్కడ వాడబడిన పదం ""సందేశం"" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు యొక్క బోధలు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 1 8 sht4 figs-metaphor ἐξήχηται 1 has rung out థెస్సలొనీక విశ్వాసులద్వారా బయల్పరచబడిన క్రైస్తవ సాక్ష్యo గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, అది మోగించిన గంటవలే లేదా సంగీత వాయిద్యం వలే ఉన్నదన్నట్లుగా చెప్పాడు.. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 1 9 rd2b αὐτοὶ γὰρ 1 For they themselves థెస్సలొనీక విశ్వాసుల గురించి విన్న పరిసర ప్రాంతాలలో అప్పటికే ఉన్న సంఘాల గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు.
1TH 1 9 amc1 figs-rpronouns αὐτοὶ 1 they themselves థెస్సలొనీక విశ్వాసుల గురించి విన్న వారిని గూర్చి చెప్పడానికి ఇక్కడ “వారు” అనే పదం ఉపయోగించబడింది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])
1TH 1 9 v145 figs-metonymy ὁποίαν εἴσοδον ἔσχομεν πρὸς ὑμᾶς 1 what kind of reception we had among you రిసెప్షన్"" అనే నైరూప్య నామవాచకం ""స్వీకరించుట"" లేదా ""స్వాగతించుట"" అనే క్రియగా వ్యక్తీకరించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మమ్మల్ని ఎంత హృదయపూర్వకంగా స్వీకరించారు"" లేదా ""మీరు మమ్మల్ని ఎంత హృదయపూర్వకంగా స్వాగతించారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 1 9 u1um figs-metaphor ἐπεστρέψατε πρὸς τὸν Θεὸν ἀπὸ τῶν εἰδώλων, δουλεύειν Θεῷ ζῶντι καὶ ἀληθινῷ 1 you turned to God from the idols to serve the living and true God ఇక్కడ ""వదిలి ... తిరిగారో"" అనేది ఒక రూపకం అంటే ఒక వ్యక్తికి విధేయత చూపడానికి ప్రారంభించడం మరియు మరొకరికి విధేయత చూపడాన్ని ఆపడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు విగ్రహాలను ఆరాధించడం మానేసి, సజీవమైన మరియు నిజమైన దేవునికి సేవ చేయడం ప్రారంభించారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 1 10 dg6a guidelines-sonofgodprinciples τὸν Υἱὸν αὐτοῦ 1 his Son యేసుకు దేవునితో ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షిక ఇది. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
1TH 1 10 pmi8 ὃν ἤγειρεν 1 whom he raised ఎవరికైతే దేవుడు తిరిగి జీవించడానికి కారణమయ్యాడో
1TH 1 10 wba8 ἐκ τῶν νεκρῶν 1 from the dead తద్వారా అతను మరణించి అలాగే ఉండలేదు. ఈ వ్యక్తీకరణ పాతాళంలో చనిపోయిన ప్రజలందరిని గూర్చి తెలియజేస్తుంది. వారి నుండి తిరిగి రావడానికి మళ్ళీ సజీవంగా మారడం గురించి మాట్లాడుతుంది.
1TH 1 10 pt1s figs-inclusive τὸν ῥυόμενον ἡμᾶς 1 who frees us ఇక్కడ పౌలు థెస్సలొనీయ విశ్వాసులను కలిపి మాట్లాడుతున్నాడు. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 2 intro kt5l 0 # 1 థెస్సలొనీకయులు 02 సాధారణ గమనికలు

## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

### క్రైస్తవ సాక్ష్యo
పౌలు సువార్త సత్యమని చెప్పడానికి తన ""క్రైస్తవ సాక్ష్యము""ను విలువైనదిగా భావిస్తాడు. దైవభక్తి లేదా పరిశుద్దoగా ఉండటం క్రైస్తవేతరులకు సాక్ష్యముగా నిలుస్తుందని పౌలు చెప్పాడు. పౌలు తన ప్రవర్తనను సమర్థిస్తాడు, తద్వారా అతని సాక్ష్యం ప్రభావితం కాకుండా ఉంటుంది. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/testimony]] మరియు [[rc://te/tw/dict/bible/kt/godly]] మరియు [[rc://te/tw/dict/bible/kt/holy]])
1TH 2 1 pt75 0 Connecting Statement: పౌలువిశ్వాసుల యొక్క సేవ మరియు బహుమానాన్ని నిర్వచిస్తున్నాడు.
1TH 2 1 gpr4 figs-rpronouns αὐτοὶ 1 you yourselves “మీ” మరియు“ మీకు” అని వాడబడిన పదాలు థెస్సలొనీయ విశ్వాసులను సూచిస్తాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])
1TH 2 1 tdl3 ἀδελφοί 1 brothers ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిపి సహ విశ్వాసులు అని.
1TH 2 1 g6qq figs-exclusive τὴν εἴσοδον ἡμῶν 1 our coming “మేము అనే మాట పౌలు, సిల్వాను, మరియు తిమోతిని సూచిస్తుంది కాని థెస్సలొనీయ విశ్వాసులను కాదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
1TH 2 1 w584 figs-doublenegatives οὐ κενὴ γέγονεν 1 was not useless ఇది సానుకూల పద్ధతిలో వ్యక్తీకరించబడవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా విలువైనది"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1TH 2 2 x6ez προπαθόντες καὶ ὑβρισθέντες 1 previously suffered and were shamefully treated నిరాదరణకు మరియు అవమానాన్ని అనుభవించాము.
1TH 2 2 v4dg ἐν πολλῷ ἀγῶνι 1 in much struggling గొప్ప వ్యతిరేకతలో పోరాడుతున్నప్పుడు
1TH 2 3 t7ty οὐκ ἐκ πλάνης, οὐδὲ ἐξ ἀκαθαρσίας, οὐδὲ ἐν δόλῳ 1 was not from error, nor from impurity, nor from deceit సత్యమైన, పవిత్రమైన, మరియు నిజాయితీతో కూడినది.
1TH 2 4 is1a δεδοκιμάσμεθα ὑπὸ τοῦ Θεοῦ, πιστευθῆναι 1 approved by God to be trusted పౌలు దేవునిచే పరీక్షించబడి నమ్మకస్తుడని (యోగ్యుడని) రుజువుపరచబడ్డాడు.
1TH 2 4 qqj2 figs-explicit λαλοῦμεν 1 we speak పౌలు సువార్త సందేశాన్ని ప్రకటించడాన్ని సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 2 4 k1m9 figs-metonymy τῷ δοκιμάζοντι τὰς καρδίας ἡμῶν 1 who examines our hearts హృదయాలు"" అనే పదం ఒక వ్యక్తి యొక్క కోరికలు మరియు ఆలోచనలకు వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా కోరికలు మరియు ఆలోచనలు ఎవరికీ తెలుసో"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 2 5 xcy6 0 General Information: తన ప్రవర్తన ముఖస్తుతి, దురాశ లేదా ఆత్మ స్తుతిపై ఆధారపడలేదని థెస్సలొనీక విశ్వాసులకు పౌలు చెబుతాడు.
1TH 2 5 i8cr οὔτε…ἐν λόγῳ κολακίας ἐγενήθημεν 1 we never came with words of flattery మేము మీతో తప్పుడు పొగడ్తలతో మాట్లాడలేదు.
1TH 2 7 ag1l figs-simile ὡς ἐὰν τροφὸς θάλπῃ τὰ ἑαυτῆς τέκνα 1 as a mother comforting her own children ఒక తల్లి తన పిల్లలను సున్నితంగా ఆదరించినట్లే, పౌలు, సిల్వాను మరియు తిమోతి థెస్సలొనీక విశ్వాసులతో సున్నితంగా మాట్లాడారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1TH 2 8 r8b4 οὕτως ὁμειρόμενοι ὑμῶν 1 In this way we had affection for you ఈ విధంగా మేము మీపట్ల మా ఆప్యాయతను చూపాము.
1TH 2 8 g73f ὁμειρόμενοι ὑμῶν 1 we had affection for you మేము మిమ్మల్ని ప్రేమించాము.
1TH 2 8 q86v figs-metaphor εὐδοκοῦμεν μεταδοῦναι ὑμῖν, οὐ μόνον τὸ εὐαγγέλιον τοῦ Θεοῦ, ἀλλὰ καὶ τὰς ἑαυτῶν ψυχάς 1 We were pleased to share with you not only the gospel of God but also our own lives సువార్త సందేశం మరియు అతని జీవితం మరియు అతనితో ఉన్నవారి జీవితాల గురించి అవి ఇతరులతో పంచుకోగల భౌతిక వస్తువులాగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు దేవుని సువార్త చెప్పడానికి మాత్రమే కాకుండా, మీతో సమయాన్ని గడపడానికి మరియు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 2 8 p4e4 ἀγαπητοὶ ἡμῖν ἐγενήθητε 1 you had become very dear to us మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు
1TH 2 9 j9lu ἀδελφοί 1 brothers ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి తోటి క్రైస్తవులు.
1TH 2 9 tc98 figs-doublet τὸν κόπον ἡμῶν καὶ τὸν μόχθον 1 our labor and toil ప్రయాస"" మరియు ""కష్టము"" అనే పదాలు ప్రాథమికంగా ఒకే విషయం. వారు ఎంత కష్టపడ్డారో నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము ఎంత కస్టపడి పని చేశామో"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1TH 2 9 b16f νυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι, πρὸς τὸ μὴ ἐπιβαρῆσαί τινα ὑμῶν 1 Night and day we were working so that we might not weigh down any of you కాబట్టి మీరు మాకు సహాయం చేయనవసరం లేకుండా మా స్వంత జీవనం కోసం మేము చాలా కష్టపడ్డాము.
1TH 2 10 il3e ὁσίως, καὶ δικαίως, καὶ ἀμέμπτως 1 holy, righteous, and blameless థెస్సలొనీక విశ్వాసుల పట్ల వారి మంచి ప్రవర్తనను వివరించే మూడు పదాలను పౌలు ఉపయోగించాడు.
1TH 2 11 i58m figs-metaphor ὡς πατὴρ τέκνα ἑαυτοῦ 1 as a father with his own children ఎలా ప్రవర్తించాలో తన పిల్లలకు సున్నితంగా నేర్పించే తండ్రితో థెస్సలొనీకయులను తాను ప్రోత్సహించిన విధానాన్ని పౌలు పోల్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 2 12 m91e figs-doublet παρακαλοῦντες ὑμᾶς, καὶ παραμυθούμενοι, καὶ μαρτυρόμενοι…ὑμᾶς 1 exhorting you and encouraging and urging you పౌలు బృందం థెస్సలొనీకయులను ఎంత భారంతో ప్రోత్సహించిందో వ్యక్తీకరించడానికి ""ఉపదేశించడం,"" ""ప్రోత్సహించడం"" మరియు ""విజ్ఞప్తి"" అనే పదాలు కలిసి ఉపయోగించబడ్డాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1TH 2 12 n8dr figs-hendiadys εἰς τὴν ἑαυτοῦ βασιλείαν καὶ δόξαν 1 into his own kingdom and glory “మహిమ” అనే పదం “రాజ్యము” అనే పదమును వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన స్వంత మహిమాన్విత రాజ్యము లోనికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
1TH 2 12 qmc3 figs-metaphor εἰς τὸ περιπατεῖν ὑμᾶς ἀξίως τοῦ Θεοῦ 1 to walk in a manner that is worthy of God ఇక్కడ నడవడం ""జీవించడానికి” వాడబడిన ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు దేవుని గురించి బాగా ఆలోచించేలా జీవించండి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 2 13 au3b 0 General Information: పౌలు తనను మరియు తన ప్రయాణ సహచరులను సూచించడానికి ""మేము"" అనే పదమును మరియు థెస్సలొనీక విశ్వాసులను సూచించడానికి ""మీరు"" అని ఉపయోగిస్తూనే ఉన్నాడు.
1TH 2 13 z53w καὶ ἡμεῖς εὐχαριστοῦμεν τῷ Θεῷ ἀδιαλείπτως 1 we also thank God constantly తాను వారితో పంచుకున్న సువార్త సందేశాన్ని అంగీకరించినందుకు పౌలు తరచుగా దేవునికి కృతజ్ఞతలు తెలిపేవాడు.
1TH 2 13 zj5f figs-synecdoche οὐ λόγον ἀνθρώπων 1 not as the word of man ఇక్కడ “మనుషుల మాట”గా వాడబడిన పదం ""మనిషి నుండి వచ్చిన సందేశం""కు వాడబడిన క్లుప్త పదం. ప్రత్యామ్నాయ అనువాదం: ""(ఇది) మనిషి ద్వారా రూపొందించబడిన సందేశం కాదు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
1TH 2 13 rpb1 figs-metonymy ἐδέξασθε…καθὼς ἀληθῶς ἐστὶν, λόγον Θεοῦ 1 you accepted it ... as it truly is, the word of God ఇక్కడ వాడబడిన పదం ""సందేశం"" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఇది నిజంగానే దేవుని నుండి వచ్చిన సందేశం వలే"" దీన్ని అంగీకరించారు ... (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 2 13 ci1e figs-personification ὃς καὶ ἐνεργεῖται ἐν ὑμῖν τοῖς πιστεύουσιν 1 which is also at work in you who believe పౌలు దేవుని సువార్త సందేశాన్ని పని చేస్తున్న వ్యక్తిగా పోల్చి మాట్లాడుతున్నాడు. ""వాక్కు"" అనేది ""సందేశం"" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో విశ్వాసులైనవారు వింటున్నారు మరియు విధేయత చూపుటకు ప్రారంభిస్తున్నారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]] మరియు [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 2 14 s2mp ἀδελφοί 1 brothers ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి సహ క్రైస్తవులు.
1TH 2 14 mh8n μιμηταὶ ἐγενήθητε…τῶν ἐκκλησιῶν 1 became imitators of the churches థెస్సలొనీయ విశ్వాసులు యూదా విశ్వాసుల మాదిరిగానే హింసలను భరించారు. ""దేవుని సంఘాల ను పొలి నడుచుకుంటున్నారు
1TH 2 14 cxm3 ὑπὸ τῶν ἰδίων συμφυλετῶν 1 from your own countrymen ఇతర థెస్సలొనీయుల నుండి
1TH 2 16 rw7e κωλυόντων ἡμᾶς…λαλῆσαι 1 They forbid us to speak వారు ప్రకటించకుండా మమ్మల్ని అడ్డుకున్నారు
1TH 2 16 n2ue figs-metaphor τὸ ἀναπληρῶσαι αὐτῶν τὰς ἁμαρτίας πάντοτε 1 they always fill up their own sins ఎవరైనా తమ పాపాలతో ఒక కంటైనర్‌ను ద్రవంతో నింపగలిగినట్లు పోల్చి పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 2 16 fq9m ἔφθασεν…ἐπ’ αὐτοὺς ἡ ὀργὴ εἰς τέλος 1 wrath will overtake them in the end ఇది దేవుడు చివరకు ప్రజల పాపాలకు తీర్పు ఇవ్వడం మరియు శిక్షించడం సూచిస్తుంది.
1TH 2 17 edb1 ἀδελφοί 1 brothers ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి సహ క్రైస్తవులు.
1TH 2 17 vr7v figs-metonymy προσώπῳ οὐ καρδίᾳ 1 in person not in heart ఇక్కడ ""హృదయం"" అనేది ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. పౌలు మరియు అతనితో ప్రయాణిస్తున్నవారు థెస్సలొనీక లో భౌతికంగా వారితో లేనప్పటికీ, వారు అక్కడి విశ్వాసుల గురించి శ్రద్ధ తీసుకోవడం మరియు ఆలోచించడం కొనసాగించారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ముఖాముఖిగా, కానీ మేము మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 2 17 t5d5 figs-synecdoche τὸ πρόσωπον ὑμῶν ἰδεῖν 1 to see your face ఇక్కడ ""మీ ముఖము"" అంటే మొత్తం వ్యక్తి అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని చూడటానికి"" లేదా ""మీతో ఉండటానికి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
1TH 2 19 j7j5 figs-rquestion τίς γὰρ ἡμῶν ἐλπὶς ἢ χαρὰ ἢ στέφανος καυχήσεως? ἢ οὐχὶ καὶ ὑμεῖς, ἔμπροσθεν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν τῇ αὐτοῦ παρουσίᾳ? 1 For what is our hope, or joy, or crown of pride in front of our Lord Jesus at his coming? Is it not you? పౌలు థెస్సలొనీక విశ్వాసులను చూడాలనుకుంటున్న కారణాలను నొక్కి చెప్పడానికి ప్రశ్నలను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భవిష్యత్తులో మన ప్రభువైన యేసు రాకడలో మా ఆశ, ఆనందము, అతిశయ కిరీటము ఆయన యెదుట మీరే."" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]])
1TH 2 19 mj9n figs-metonymy ἡμῶν ἐλπὶς…ἢ οὐχὶ καὶ ὑμεῖς 1 our hope ... Is it not you ఆశ"" ద్వారా పౌలు భావమేమంటే దేవుడు తన పనికి ప్రతిఫలమిస్తాడనే భరోసా. అతని ఆశకు థెస్సలొనీయ క్రైస్తవులు కారణం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 2 19 ty78 figs-metonymy ἢ χαρὰ 1 or joy అతని ఆనందానికి థెస్సలొనీకయులే కారణం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 2 19 e7tl figs-metonymy στέφανος καυχήσεως 1 crown of pride ఇక్కడ ""కిరీటం"" అనేది విజయవంతమైన అథ్లెట్లకు (జెట్టియైనవారికి) ఇచ్చే లారెల్ దండను సూచిస్తుంది. ""అతిశయ కిరీటం"" అనే వ్యక్తీకరణ అంటే విజయానికి ప్రతిఫలం, లేదా బాగా చేసినది అనే భావం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 3 intro j379 0 # 1 థెస్సలొనీకయులు 03 సాధారణ గమనికలు

## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

### నిలుచుట
ఈ అధ్యాయంలో, పౌలు స్థిరంగా ఉండటాన్ని వివరించడానికి ""నిలుకడగా ఉండుట""ను ఉపయోగించాడు. స్థిరంగా ఉండుట లేదా నమ్మకంగా ఉండుట అనేది వివరించడానికి ఇది ఒక సాధారణ మార్గం. పౌలు స్థిరంగా ఉండటానికి విరుద్ధంగా ""చెదిరిపోవుట"" అని ఉపయోగించాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/faithful]])
1TH 3 1 nal1 0 Connecting Statement: విశ్వాసులను బలపరచడానికి తిమోతిని పంపినట్లు పౌలు తెలియజేస్తున్నాడు.
1TH 3 1 fqe3 μηκέτι στέγοντες 1 we could no longer bear it మేము మీ గురించి చింతిస్తూ ఉండక
1TH 3 1 t3vt ηὐδοκήσαμεν καταλειφθῆναι ἐν Ἀθήναις μόνοι 1 good to be left behind at Athens alone సిల్వాను మరియు నేను ఏథెన్సులో ఒంటరిగా ఉండుట మంచిదని
1TH 3 1 qhj4 ηὐδοκήσαμεν 1 it was good ఇది సరైనది లేదా “ఇది సహేతుకమైనది”
1TH 3 1 laf9 translate-names Ἀθήναις 1 Athens ఇది అకయ ప్రాంతంలోని ఒక నగరం, ఇది ఇప్పుడు ఆధునిక గ్రీసుగా పిలువబడుచున్నది.. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
1TH 3 2 d8yy τὸν ἀδελφὸν ἡμῶν, καὶ διάκονον 1 our brother and fellow worker ఈ రెండు వ్యక్తీకరణలు కూడా తిమోతిని గూర్చే తెలియజేస్తున్నాయి.
1TH 3 3 y74m figs-idiom μηδένα σαίνεσθαι 1 no one would be shaken చెదిరిపోవడం"" అనే మాట భయపడటానికి వాడబడిన ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తుపై నమ్మకం ఉంచడంలో ఎవరూ భయపడరు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
1TH 3 3 rkx9 figs-explicit κείμεθα 1 we have been appointed వారిని నియమించినది దేవుడేనని అందరికీ తెలుసు అని పౌలు అనుకొంటున్నాడు. దీన్నిస్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మనలను నియమించాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 3 4 nm1l θλίβεσθαι 1 to suffer affliction ఇతరులచేత తప్పుగా వ్యవహరించబడుటకు
1TH 3 5 st3d figs-idiom κἀγὼ μηκέτι στέγων 1 I could no longer stand it పౌలు ఒక జాతీయాన్ని ఉపయోగించి తన భావోద్వేగాలను వివరించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఇక ఉండబట్టలేక"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
1TH 3 5 zn36 figs-explicit ἔπεμψα 1 I sent పౌలు తిమోతిని పంపించాడని సూచించబడింది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను తిమోతిని పంపాను"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 3 5 g92s ὁ κόπος ἡμῶν 1 our labor మీ మధ్య మా ప్రయాస లేదా “మీ మధ్య మా బోధ”
1TH 3 5 ne5x εἰς κενὸν 1 in vain వ్యర్ధమైపోయిందేమో
1TH 3 6 r4pa 0 Connecting Statement: వారిని దర్శించిన తర్వాత తిమోతి ఇచ్చిన సమాచారం గురించి పౌలు తన పాఠకులకు తెలియజేస్తున్నాడు.
1TH 3 6 gci4 figs-exclusive ἐλθόντος…πρὸς ἡμᾶς 1 came to us “మమ్మల్ని” అనే పదం పౌలును మరియుసిల్వానును సూచిన్తుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-exclusive]])
1TH 3 6 tu8d figs-explicit εὐαγγελισαμένου…τὴν πίστιν…ὑμῶν 1 the good news of your faith ఇది క్రీస్తులో ఉంచే విశ్వాసాన్ని సూచిస్తుందని అర్ధం అవుతుంది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ విశ్వాసంను గూర్చిన మంచి వార్త"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 3 6 e6kx ἔχετε μνείαν…ἀγαθὴν πάντοτε 1 you always have good memories వారు పౌలు గురించి ఆలోచించినప్పుడు, వారెల్లప్పుడూ అతని గురించి మంచి ఆలోచనలు కలిగి ఉందేవారు.
1TH 3 6 tx4h ἐπιποθοῦντες ἡμᾶς ἰδεῖν 1 you long to see us మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు
1TH 3 7 mqy5 ἀδελφοί 1 brothers ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు
1TH 3 7 k54j figs-explicit διὰ τῆς ὑμῶν πίστεως 1 because of your faith ఇది క్రీస్తులో విశ్వాసాన్ని సూచిస్తుంది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తులో మీ విశ్వాసం కారణంగా"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 3 7 csz7 figs-doublet ἐπὶ πάσῃ τῇ ἀνάγκῃ καὶ θλίψει ἡμῶν 1 in all our distress and affliction ఇబ్బంది"" అనే పదం వారు ఎందుకు ""బాధలో"" ఉన్నారో వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా ఇబ్బందుల వల్ల కలిగే అన్ని బాధలలో"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1TH 3 8 x5xt figs-idiom ζῶμεν 1 we live సంతృప్తి కరమైన జీవితాన్ని జీవించడాన్ని వ్యక్తీకరించే ఒక జాతీయం ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము చాలా ప్రోత్సహించబడ్డాము” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-idiom]])
1TH 3 8 x4zn figs-idiom ἐὰν ὑμεῖς στήκετε ἐν Κυρίῳ 1 if you stand firm in the Lord నిలుకడగా ఉండుట"" అనేది నమ్మకస్తులుగా కొనసాగడానికి ఉపయోగించబడిన ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ప్రభువుపై నమ్మకం ఉంచుట కొనసాగిస్తే"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
1TH 3 9 pzq7 figs-rquestion τίνα γὰρ εὐχαριστίαν δυνάμεθα τῷ Θεῷ ἀνταποδοῦναι περὶ ὑμῶν, ἐπὶ πάσῃ τῇ χαρᾷ ᾗ χαίρομεν δι’ ὑμᾶς, ἔμπροσθεν τοῦ Θεοῦ ἡμῶν 1 For what thanks can we give to God for you, for all the joy that we have before our God over you? ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రకటనగా వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ కోసం చేసిన దానికి మేము తగినంతగా కృతజ్ఞతలు చెల్లించలేము! మేము మన దేవునికి ప్రార్థించినప్పుడల్లా మేము మీ విషయమై ఎంతో ఆనందిస్తున్నాము!"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]])
1TH 3 9 p5ka figs-metaphor ἔμπροσθεν τοῦ Θεοῦ ἡμῶν 1 before our God పౌలు తాను మరియు అతని సహచరులు శారీరకంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అతను బహుశా ప్రార్థన యొక్క కార్యాచరణను సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 3 10 k71n ὑπέρ ἐκ περισσοῦ 1 very hard తీవ్రంగా
1TH 3 10 eb26 figs-synecdoche τὸ ἰδεῖν ὑμῶν τὸ πρόσωπον 1 see your face ముఖం"" అనే పదం వారి మొత్తం వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని దర్శించాలని"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
1TH 3 11 tet9 0 General Information: ఈ వచనాలలో, ""మన"" అనే పదం ఎప్పుడూ ఒకే ప్రజల సమూహాన్ని సూచించదు. ప్రత్యేకతల కోసం తర్జుమా గమనికలను చూడండి.
1TH 3 11 bql9 figs-inclusive ὁ Θεὸς…Πατὴρ ἡμῶν 1 May our God ... our Lord Jesus పౌలు తన పరిచర్య బృందంతో థెస్సలొనీక విశ్వాసులను చేర్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 3 11 mc2m ὁ Θεὸς…ἡμῶν 1 May our God ప్రార్ధనలో వేడుకుంటున్నాము
1TH 3 11 um1c figs-metaphor κατευθύναι τὴν ὁδὸν ἡμῶν πρὸς ὑμᾶς 1 direct our way to you థెస్సలొనీక క్రైస్తవులను దర్శించడానికి దేవుడు తనకు మరియు అతని సహచరులకు మార్గం చూపించాలని తాను కోరుకుంటున్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు అలా చేయటానికి వీలు కల్పించాలని అతను కోరుకుంటున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 3 11 efl5 figs-exclusive κατευθύναι τὴν ὁδὸν ἡμῶν πρὸς ὑμᾶς 1 direct our way to you మమ్మల్ని"" అనే పదం పౌలును, సిల్వానును మరియు తిమోతిలను సూచిస్తుంది కాని థెస్సలొనీయ విశ్వాసులను కాదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
1TH 3 11 mp6s figs-rpronouns αὐτὸς…Πατὴρ 1 Father himself ఇక్కడ ""స్వయంగా"" అనే పదం ""తండ్రి""ని సూచిస్తూ ప్రాముఖ్యత కోసం చెప్పబడింది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])
1TH 3 12 f5z3 figs-metaphor πλεονάσαι καὶ περισσεύσαι τῇ ἀγάπῃ 1 increase and abound in love పౌలు ప్రేమను ఎక్కువగా పొందగల ఒక వస్తువుగా పోల్చి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 3 13 ly21 figs-metonymy τὸ στηρίξαι ὑμῶν τὰς καρδίας, ἀμέμπτους 1 strengthen your hearts, so that they will be ఇక్కడ ""హృదయం"" అనేది ఒకరి నమ్మకాలు మరియు అభిప్రాయాలకు వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బలపరచును గాక, కాబట్టి మీరు అలా ఉండేలా"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 3 13 xsd3 ἐν τῇ παρουσίᾳ τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ 1 at the coming of our Lord Jesus యేసు భూమిపైకి వచ్చినప్పుడు
1TH 3 13 jlc5 μετὰ πάντων τῶν ἁγίων αὐτοῦ 1 with all his saints తన పరిశుద్దులందరితో కలిసి
1TH 4 intro b1z5 0 # 1 థెస్సలొనీకయులు 04 సాధారణ గమనికలు

## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

### లైంగిక అనైతికత
వివిధ సంస్కృతులు లైంగిక నైతికత విషయంలో భిన్నమైన ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ విభిన్న సాంస్కృతిక ప్రమాణాలు ఈ భాగాన్ని తర్జుమా చేయడాన్ని కష్టతరం చేస్తాయి. సాంస్కృతిక నిషేధాల గురించి అనువాదకులు కూడా అప్రమత్తులై ఉండాలి. ఇవి చర్చించటానికి అనుచితమైన అంశాలు.

### క్రీస్తు తిరిగి రాకముందే మరణించడం
ప్రారంభ సంఘంలో, క్రీస్తు తిరిగి రాకముందే విశ్వాసి మరణిస్తే ఏమి జరుగుతుందో అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారు దేవుని రాజ్యంలో భాగమేనా అని వారు భయపడి ఉండవచ్చు. పౌలు ఆ ఆందోళనకు సమాధానమిచ్చాడు.

### ""ఆకాశమండలంలో ప్రభువును కలవడానికి మేఘాలపై తీసుకెళ్లబడడం""
ఈ భాగం యేసు తనను నమ్మిన వారిని తనను తాను పిలిచే సమయాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు యొక్క చివరి అద్భుతమైన రాకడని సూచిస్తుందా లేదా అనే దానిపై పండితులు విభేదిస్తున్నారు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/believe]])
1TH 4 1 wk39 ἀδελφοί 1 brothers ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని అర్ధం.
1TH 4 1 u2lw figs-doublet ἐρωτῶμεν ὑμᾶς καὶ παρακαλοῦμεν 1 we encourage and exhort you విశ్వాసులను వారు ఎంత బలంగా ప్రోత్సహిస్తారో నొక్కిచెప్పడానికి పౌలు ""బ్రతిమాలుట"" మరియు ""ఆదేశము"" అనే పదాలను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1TH 4 1 iij6 figs-activepassive παρελάβετε παρ’ ἡμῶν 1 you received instructions from us దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము మీకు నేర్పించాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
1TH 4 1 p4db figs-metaphor δεῖ ὑμᾶς περιπατεῖν 1 you must walk ఇక్కడ ""నడక"" అనేది ఒక వ్యక్తి జీవించే విధానానికి వ్యక్తీకరణ. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు జీవించాలి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 4 2 vg16 figs-metaphor διὰ τοῦ Κυρίου Ἰησοῦ 1 through the Lord Jesus పౌలు తన సూచనలను యేసే స్వయంగా ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 4 3 mw4j ἀπέχεσθαι ὑμᾶς…τῆς πορνείας 1 you avoid sexual immorality మీరు లైంగిక అనైతిక కార్యాలకు దూరంగా ఉండాలి
1TH 4 4 f4ux εἰδέναι…τὸ ἑαυτοῦ σκεῦος, κτᾶσθαι 1 know how to possess his own vessel సాధ్యమయ్యే అర్ధాలు 1) ""తన స్వంత భార్యతో ఎలా జీవించాలో తెలుసుకొనుట"" లేదా 2) ""తన శరీరాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకొనుట
1TH 4 5 x2t7 ἐν πάθει ἐπιθυμίας 1 in the passion of lust తప్పుడు కామ వికారంతో
1TH 4 6 gn9i figs-gendernotations τὸ μὴ 1 no man ఇక్కడ “సోదరున్ని"" అనేది పురుషుడు లేదా స్త్రీని సూచిస్తుంది. ""ఎవరూ"" లేదా "" ఏ వ్యక్తి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])
1TH 4 6 a9st figs-doublet ὑπερβαίνειν καὶ πλεονεκτεῖν 1 transgress and wrong భావనను బలోపేతం చేయడానికి ఒకే ఆలోచనను రెండు విధాలుగా పేర్కొనే [డబ్లెట్ స్టేటింగ్] ప్రకటన ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తప్పు పనులు చేయండి"" (చూడండి:[[rc://te/ta/man/translate/figs-doublet]])
1TH 4 6 q7bf figs-explicit ἔκδικος Κύριος 1 the Lord is an avenger దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతిక్రమించినవారిని ప్రభువు శిక్షిస్తాడు మరియు అన్యాయానికి గురైన వారిని రక్షిస్తాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 4 6 d1ip προείπαμεν ὑμῖν καὶ διεμαρτυράμεθα 1 forewarned you and testified మీకు ముందే చెప్పి, దానికి వ్యతిరేకంగా గట్టిగా హెచ్చరించాము
1TH 4 7 v3np figs-doublenegatives οὐ…ἐκάλεσεν ἡμᾶς ὁ Θεὸς ἐπὶ ἀκαθαρσίᾳ, ἀλλ’ ἐν ἁγιασμῷ 1 God did not call us to uncleanness, but to holiness దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మనల్ని పరిశుభ్రత మరియు పవిత్రత కొరకు పిలిచాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1TH 4 7 q4tj figs-inclusive οὐ…ἐκάλεσεν ἡμᾶς ὁ Θεὸς 1 God did not call us మనలను"" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 4 8 mn5y ὁ ἀθετῶν 1 he who rejects this ఎవరైతే ఈ ఉపదేశమును నిరాకరిస్తారో లేదా ""ఈ ఉపదేశమును ఎవరు తిరస్కరిస్తారో
1TH 4 8 su51 ἀθετῶν, οὐκ ἄνθρωπον ἀθετεῖ, ἀλλὰ τὸν Θεὸν 1 rejects not people, but God ఈ ఉపదేశము మనిషి నుండి కాదు, దేవుని నుండి వచ్చినదని పౌలు నొక్కి చెప్పాడు.
1TH 4 9 uxn8 τῆς φιλαδελφίας 1 brotherly love తోటి విశ్వాసులపట్ల ప్రేమ
1TH 4 10 dec9 ποιεῖτε αὐτὸ εἰς πάντας τοὺς ἀδελφοὺς, τοὺς ἐν ὅλῃ τῇ Μακεδονίᾳ 1 you do this for all the brothers who are in all Macedonia మాసిదోనియా అంతటా ఉన్న తోటి విశ్వాసులకు మీరు ప్రేమ చూపించారు
1TH 4 10 jcg3 ἀδελφοὺς 1 brothers ఇక్కడ “సోదరులు” అంటే తోటి క్రైస్తవులు అని అర్ధం.
1TH 4 11 d2fg φιλοτιμεῖσθαι 1 to aspire ప్రయత్నించడానికి
1TH 4 11 j4c7 figs-metaphor ἡσυχάζειν 1 live quietly పౌలు ""ప్రశాంతత"" అనే పదాన్ని ఒక సమాజంలో మరియు కలహాలకు కారణం కాకుండా శాంతిగా జీవించడం అనేదాన్ని వివరించడానికి ఒక రూపకంగా ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రశాంతంగా మరియు క్రమంగా జీవించండి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 4 11 jmt9 figs-explicit πράσσειν τὰ ἴδια 1 take care of your own responsibilities మీ స్వంత పని చేయండి లేదా ""మీరు చేయవలసిన బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోండి.""మనము ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదని, వారి విషయమై వ్యర్ధంగా మాట్లాడకూడదని కూడా సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 4 11 bz8s figs-metaphor ἐργάζεσθαι ταῖς ἰδίαις χερσὶν ὑμῶν 1 work with your hands ఇది ఉత్పాదక జీవితాన్ని గడపడాన్ని గురించి చెప్పే ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు జీవించడానికి అవసరమైనదాన్ని సంపాదించడానికి మీ స్వంత పనులు చేయండి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 4 12 hp6g figs-metaphor περιπατῆτε εὐσχημόνως 1 walk properly ఇక్కడ ""నడక"" అనేది ""జీవించుట"" లేదా ""ప్రవర్తించుట""కు ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""సరిగ్గా ప్రవర్తించండి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 4 12 yl36 εὐσχημόνως 1 properly ఇతరులకు మర్యాద చూపించే విధంగా మరియు వారి మర్యాదను సంపాదించే విధంగా
1TH 4 12 k59r figs-metaphor πρὸς τοὺς ἔξω 1 before outsiders క్రీస్తును నమ్మని వారి గురించి విశ్వాసులకు దూరంగా స్థలానికి వెలుపల ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తును నమ్మని వారి దృష్టిలో"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 4 13 j68e 0 General Information: పౌలు చనిపోయిన విశ్వాసుల గురించి, ఇంకా బతికే ఉన్నవారి గురించి మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సజీవంగా ఉండబోవువారి గురించి మాట్లాడుతున్నాడు.
1TH 4 13 d9g4 οὐ θέλομεν…ὑμᾶς ἀγνοεῖν 1 We do not want you to be uninformed దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు సమాచారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము"" లేదా ""మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము
1TH 4 13 wt7l ἀδελφοί 1 brothers ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు
1TH 4 13 zqz6 figs-euphemism τῶν κοιμωμένων 1 those who sleep ఇక్కడ ""కన్నుమూసిన"" అనేది చనిపోయిన స్థితికి ఒక సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణించిన వారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
1TH 4 13 r9f8 ἵνα μὴ λυπῆσθε, καθὼς…οἱ λοιποὶ 1 so that you do not grieve like the rest ఎందుకనగా మిగిలిన వారివలే మీరు దుఃఖపడాలని మేము కోరుకోవడం లేదు
1TH 4 13 qt5b λυπῆσθε 1 grieve దుఃఖపడుట, దేనిగురించో విచారంగా ఉండుట
1TH 4 13 rl73 figs-explicit καθὼς…οἱ λοιποὶ, οἱ μὴ ἔχοντες ἐλπίδα 1 like the rest who do not have hope భవిష్యత్ వాగ్దానంపై నమ్మకం లేని వ్యక్తులు. ఆ వ్యక్తులు వేటిపై నమ్మకముంచరో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మృతులలోనుండి లేస్తారని ఖచ్చితంగా తెలియని వ్యక్తుల వలె"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 4 14 ybz6 figs-inclusive εἰ…πιστεύομεν 1 if we believe ఇక్కడ ""మేము""అనే పదము పౌలు మరియు అతని ప్రేక్షకులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 4 14 kmk2 ἀνέστη 1 rose again తిరిగి జీవించుటకు లేచుట
1TH 4 14 bi9w figs-euphemism τοὺς κοιμηθέντας διὰ τοῦ Ἰησοῦ 1 those who have fallen asleep in him ఇక్కడ ""కన్ను మూయుట"" అనేది మరణించినట్లు సూచించడానికి ఒక మర్యాదపూర్వక మార్గం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
1TH 4 15 ni3m figs-metonymy ἐν λόγῳ Κυρίου 1 by the word of the Lord ఇక్కడ పదం ""సందేశం"" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు బోధలను అర్థం చేసుకోవడం ద్వారా"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1TH 4 15 b786 εἰς τὴν παρουσίαν τοῦ Κυρίου 1 at the coming of the Lord ప్రభువు తిరిగి వచ్చువరకు
1TH 4 16 ah7p αὐτὸς ὁ Κύριος…καταβήσεται 1 the Lord himself will descend ప్రభువు తానే దిగి వస్తాడు
1TH 4 16 z9ka ἀρχαγγέλου 1 the archangel ప్రధాన దూత
1TH 4 16 dr89 figs-explicit οἱ νεκροὶ ἐν Χριστῷ ἀναστήσονται πρῶτον 1 the dead in Christ will rise first క్రీస్తును నమ్మి చనిపోయినవారు"" చనిపోయిన విశ్వాసులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుక్రీస్తును విశ్వసించినవారు, కాని అప్పటికే మరణించిన వారు మొదట లేస్తారు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1TH 4 17 l5l1 figs-inclusive ἡμεῖς οἱ ζῶντες 1 we who are alive ఇక్కడ ""మనము"" అంటే మరణించని విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 4 17 wvi8 σὺν αὐτοῖς 1 with them వారిని"" అనే పదం చనిపోయి తిరిగి లేచిన విశ్వాసులను సూచిస్తుంది.
1TH 4 17 se1y ἁρπαγησόμεθα ἐν νεφέλαις εἰς ἀπάντησιν τοῦ Κυρίου εἰς ἀέρα 1 caught up in the clouds to meet the Lord in the air ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి
1TH 5 intro ay3d 0 # 1 థెస్సలొనీకయులు 05 సాధారణ గమనికలు

## నిర్మాణం మరియు ఆకృతీకరణ

పౌలు తన లేఖను పురాతన సమీప తూర్పు ప్రాంతంలోని అక్షరాలకు విలక్షణమైన రీతిలో ముగించారు.

## ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు

### ప్రభువు దినo
ప్రభువు రాబోయే రోజు యొక్క ఖచ్చితమైన సమయం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ""రాత్రి పూట దొంగ లాగా"" అనేదాని అనుకరణ అంటే ఇదే. ఈ కారణంగా, క్రైస్తవులు ప్రభువు రాక కోసం సిద్ధంగా ఉండాలి. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/dayofthelord]] మరియు [[rc://te/ta/man/translate/figs-simile]])

### ఆత్మను ఆర్పుట
దీని అర్థం నిర్లక్ష్యపెట్టుట లేదా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం మరియు పనికి వ్యతిరేకంగా పనిచేయడం.
1TH 5 1 i2vm figs-exclusive 0 General Information: ఈ అధ్యాయంలో ""మేము"" మరియు ""మాకు"" అనే పదాలు పౌలు, సిల్వాను మరియు తిమోతిలను సూచిస్తాయి. అలాగే, ""మీరు"" అనే పదం బహువచనంలో ఉంది మరియు థెస్సలొనీక సంఘంలోని విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])
1TH 5 1 z1s6 0 Connecting Statement: యేసు తిరిగి వచ్చే రోజు గురించి మాట్లాడడాన్ని పౌలు కొనసాగిస్తున్నాడు.
1TH 5 1 h84m τῶν χρόνων καὶ τῶν καιρῶν 1 the times and seasons ఇది యేసు తిరిగి వచ్చినప్పుడు జరుగబోవు సంఘటనలను సూచిస్తుంది.
1TH 5 1 uq3n ἀδελφοί 1 brothers ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని భావం
1TH 5 2 mcq9 ἀκριβῶς 1 perfectly well చాలా బాగా లేదా ""ఖచ్చితంగా
1TH 5 2 tmj3 figs-simile ὡς κλέπτης ἐν νυκτὶ οὕτως 1 like a thief in the night ఒక దొంగ ఏ రాత్రి వస్తాడో ఒకనికి తెలియనట్లే , ప్రభువు దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అనుకోకుండా"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1TH 5 3 p1wi ὅταν λέγωσιν 1 When they say ప్రజలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు
1TH 5 3 ne9n τότε αἰφνίδιος…ὄλεθρος 1 then sudden destruction అప్పుడు అకస్మాత్తుగా నాశనం
1TH 5 3 f1xr figs-simile ὥσπερ ἡ ὠδὶν τῇ ἐν γαστρὶ ἐχούσῃ 1 like birth pains in a pregnant woman గర్భిణీ స్త్రీకి పుట్టిన నొప్పులు అకస్మాత్తుగా వచ్చి, పుట్టుక పూర్తయ్యే వరకు ఆగనట్లే, నాశనం వస్తుంది, మరియు ప్రజలు తప్పించుకోలేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1TH 5 4 rr9j ὑμεῖς…ἀδελφοί 1 you, brothers ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని భావం
1TH 5 4 b6lv figs-metaphor οὐκ ἐστὲ ἐν σκότει 1 are not in darkness పౌలు వారు చీకటిలో ఉన్నట్లుగా దేవుని గురించిన వారి చెడు మరియు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చీకటిలో నివసించే వ్యక్తుల మాదిరిగా మీకు తెలియదు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 4 elp9 figs-simile ἵνα ἡ ἡμέρα ὑμᾶς ὡς κλέπτας καταλάβῃ 1 so that the day would overtake you like a thief ప్రభువు వచ్చే రోజు విశ్వాసులకు ఆశ్చర్యం కలిగించకూడదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1TH 5 5 zp3z figs-metaphor πάντες γὰρ ὑμεῖς υἱοὶ φωτός ἐστε, καὶ υἱοὶ ἡμέρας 1 For you are all sons of the light and sons of the day పౌలు సత్యాన్ని వెలుగులా, పగటిలా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" వెలుగులో నివసించే వ్యక్తులలాగా, పగటిపూట మనుషులలాగా మీకు సత్యం తెలుసు"" (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 5 d6fm figs-metaphor οὐκ ἐσμὲν νυκτὸς οὐδὲ σκότους 1 We are not sons of the night or the darkness పౌలు వారు చీకటిలో ఉన్నట్లుగాదేవుని గురించి వారికున్న చెడు మరియు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: చీకటిలో నివసించే వ్యక్తుల మాదిరిగా, రాత్రిపూట మనుషుల మాదిరిగా మనము తెలియనివారము కాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 6 us6s figs-metaphor μὴ καθεύδωμεν ὡς οἱ λοιποί 1 let us not sleep as the rest do పౌలు ఆత్మీయ అజ్ఞానం గురించి అది నిద్రయై ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు తిరిగి వస్తున్నాడని తెలియని ఇతరుల మాదిరిగా మనము ఉండకూడదు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 6 gu51 figs-inclusive καθεύδωμεν 1 let us మనము"" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 5 6 d2aj figs-metaphor γρηγορῶμεν καὶ νήφωμεν 1 keep watch and be sober పౌలు ఆత్మీయ అవగాహనను నిద్ర మరియు మద్యపానానికి విరుద్దమైనదిగా వర్ణించాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 7 s253 figs-metaphor οἱ γὰρ καθεύδοντες, νυκτὸς καθεύδουσιν 1 For those who sleep do so at night ప్రజలు నిద్రపోతున్నప్పుడు ఏమి జరుగుతుందో తెలియనట్లు, క్రీస్తు తిరిగి వస్తాడని ఈ ప్రపంచ ప్రజలకు తెలియదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 7 exa8 figs-metaphor οἱ μεθυσκόμενοι, νυκτὸς μεθύουσιν 1 those who get drunk do so at night రాత్రివేళ ప్రజలు త్రాగుతుంటారు, అలాగే క్రీస్తు తిరిగి రావడం గురించి అవగాహన లేని ప్రజలు వారు స్వీయ నియంత్రణ జీవితాన్ని జీవించలేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 8 zj9r figs-inclusive 0 General Information: 8-10 వచనాల్లో ""మనము"" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1TH 5 8 wh3g figs-metaphor ἡμεῖς…ἡμέρας ὄντες 1 we belong to the day ఆ దినము గురించిన దేవుని సత్యాన్ని తెలుసుకొనుట గురించి పౌలు మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మాకు సత్యం తెలుసు"" లేదా ""మేము సత్యం యొక్క వెలుగును పొందుకున్నాము"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 8 i8j1 figs-metaphor νήφωμεν 1 we must stay sober పౌలు మత్తుగా ఉండటాన్ని ఆత్మ నియంత్రణను అభ్యాసము చేయడంతో పోల్చాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనం స్వీయ నియంత్రణను అభ్యాసం చేద్దాం"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 8 ev6i figs-metaphor ἐνδυσάμενοι θώρακα πίστεως καὶ ἀγάπης 1 put on faith and love as a breastplate ఒక సైనికుడు తన శరీరాన్ని రక్షించుకోవడానికి రొమ్ముకు కవచాన్ని ధరించినట్లు, విశ్వాసం మరియు ప్రేమతో జీవించే విశ్వాసికి రక్షణ లభిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""విశ్వాసం మరియు ప్రేమద్వారా మనల్ని మనం రక్షించుకుందాం"" లేదా ""క్రీస్తును విశ్వసించి, ఆయనను ప్రేమించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుందాం"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 8 fk6r figs-metaphor περικεφαλαίαν, ἐλπίδα σωτηρίας 1 the hope of salvation for our helmet శిరస్త్రాణము సైనికుడి తలని రక్షించినట్లు, రక్షణ కొరకైన ఆశాభావం విశ్వాసిని రక్షిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు మనలను రక్షిస్తాడు అనే నిశ్చయత ద్వారా మనల్ని మనం భద్రపరచుకుందాం"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 10 w59c figs-euphemism εἴτε γρηγορῶμεν εἴτε καθεύδωμεν 1 whether we are awake or asleep ఇవి సజీవంగా లేదా చనిపోయినట్లు చెప్పే మర్యాదపూర్వక మార్గాలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనము జీవించి ఉన్నా లేక చనిపోయినా"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
1TH 5 11 r921 figs-metaphor οἰκοδομεῖτε εἷς τὸν ἕνα 1 build each other up ఇక్కడ ఆంగ్లంలో ఉపయోగించిన""బిల్డ్"" అనేది ఒక రూపకం అంటే ప్రోత్సహించండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒకరినొకరు ప్రోత్సహించండి"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 12 pd47 0 General Information: పౌలు తన తుది హెచ్చరికలను థెస్సలొనీకలోని సంఘానికి ఇవ్వడం ప్రారంభించాడు.
1TH 5 12 rka4 ἀδελφοί 1 brothers ఇక్కడ “సోదరులు” అనగా తోటి విశ్వాసులు.
1TH 5 12 ksp2 εἰδέναι τοὺς κοπιῶντας 1 to acknowledge those who labor నాయకత్వంలో ఉన్నవారిని గౌరవించడం మరియు అభినందించడం
1TH 5 12 fqh3 προϊσταμένους ὑμῶν ἐν Κυρίῳ 1 who are over you in the Lord స్థానిక విశ్వాసుల సమూహానికి నాయకులుగా ఉండి సేవ చేయడానికి దేవుడు నియమించిన వ్యక్తులను ఇది సూచిస్తుంది.
1TH 5 13 c966 ἡγεῖσθαι αὐτοὺς ὑπέρ ἐκ περισσοῦ ἐν ἀγάπῃ, διὰ τὸ ἔργον αὐτῶν 1 regard them highly in love because of their work పౌలు విశ్వాసులకు తమ సంఘ నాయకులను ప్రేమించాలని మరియు గౌరవించాలని బోధిస్తున్నాడు.
1TH 5 16 chw9 πάντοτε χαίρετε 1 Rejoice always అన్ని విషయాలలో సంతోషించే ఆత్మీయ వైఖరిని కొనసాగించాలని పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు
1TH 5 17 l63i ἀδιαλείπτως προσεύχεσθε 1 Pray without ceasing ప్రార్థనలో ఆప్రమత్తంగా ఉండాలని పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు.
1TH 5 18 z9gg ἐν παντὶ εὐχαριστεῖτε 1 In everything give thanks అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగి ఉండాలని పౌలు విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు.
1TH 5 18 bt5q ἐν παντὶ 1 In everything అన్ని పరిస్థితులలో
1TH 5 18 l3sk τοῦτο γὰρ θέλημα Θεοῦ 1 For this is the will of God పౌలు విశ్వాసుల కొరకు దేవుని చిత్తమని తాను పేర్కొన్న ప్రవర్తనను సూచిస్తున్నాడు.
1TH 5 19 j1ei τὸ Πνεῦμα μὴ σβέννυτε 1 Do not quench the Spirit మీ మధ్య పనిచేస్తున్న పరిశుద్ధాత్మ పనిని ఆపవద్దు.
1TH 5 20 iv1n προφητείας μὴ ἐξουθενεῖτε 1 Do not despise prophecies ప్రవచనాల పట్ల నిర్లక్ష్యం వద్దు లేదా ""పరిశుద్ధాత్మ ఎవరికైనా చెప్పిన దేన్నైనా ద్వేషించవద్దు
1TH 5 21 wx69 πάντα δοκιμάζετε 1 Test all things దేవుని నుండి వచ్చినట్లు కనిపించే అన్ని సందేశాలు నిజంగా ఆయన నుండి వచ్చాయా లేదా అని నిర్ధారించుకోండి
1TH 5 21 r12r figs-metaphor τὸ καλὸν κατέχετε 1 Hold on to what is good పౌలు పరిశుద్ధాత్మ నుండి వచ్చిన సందేశాలను తన చేతుల్లో పట్టుకోగలిగే వస్తువులతో పోల్చి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1TH 5 23 gu2c ἁγιάσαι ὑμᾶς ὁλοτελεῖς 1 make you completely holy దేవుడు ఒక వ్యక్తిని పాపము చేయనివాడుగా మరియు తన దృష్టిలో పరిపూర్ణుడుగా చేయడాన్ని ఇది సూచిస్తుంది.
1TH 5 23 s36k figs-activepassive ὁλόκληρον ὑμῶν τὸ πνεῦμα, καὶ ἡ ψυχὴ, καὶ τὸ σῶμα, ἀμέμπτως…τηρηθείη 1 May your whole spirit, soul, and body be preserved without blame ఇక్కడ ""ఆత్మ, ప్రాణము మరియు శరీరం"" మొత్తం పూర్తి వ్యక్తిని సూచిస్తాయి. మీ భాషకు ఈ భాగాలకు సంబంధించిన మూడు పదాలు లేకపోతే మీరు దానిని ""మీ మొత్తం జీవితం"" లేదా ""మీరు"" అని పేర్కొనవచ్చు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ జీవితాన్నంతా పాపం లేకుండా చేయును గాక"" లేదా ""దేవుడు మిమ్మును పూర్తిగా నిర్దోషిగా ఉంచునుగాక"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
1TH 5 24 mq2u πιστὸς ὁ καλῶν ὑμᾶς 1 Faithful is he who calls you మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవారు
1TH 5 24 c3jg ὃς καὶ ποιήσει 1 the one who will also do it ఆయన మీకు సహాయం చేస్తాడు
1TH 5 25 q8ki 0 General Information: పౌలు తన ముగింపు ప్రకటనలు ఇస్తున్నాడు.
1TH 5 26 qa1c ἀδελφοὺς 1 brothers ఇక్కడ “సోదరులు” అంటే తోటి క్రైస్తవులు.
1TH 5 27 n5cn figs-activepassive ἐνορκίζω ὑμᾶς τὸν Κύριον, ἀναγνωσθῆναι τὴν ἐπιστολὴν 1 I solemnly charge you by the Lord to have this letter read దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు మీతో మాట్లాడుతున్నట్లుగా, ప్రజలు ఈ లేఖను చదవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను"" లేదా ""ప్రభువు యొక్క అధికారంతో ఈ లేఖను చదవమని నేను మీకు ఆదేశిస్తున్నాను"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])