te_ta/translate/translate-names/01.md

21 KiB
Raw Permalink Blame History

వివరణ

బైబిలులో చాలా మంది మనుష్యులకూ, ప్రజా సమూహలకూ, ప్రదేశాలకూ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు కొన్నివింతగానూ, పలకడానికి కష్టంగానూ అనిపించవచ్చు. కొన్నిసార్లు పేరు ఏమి సూచిస్తుందో పాఠకులకు తెలియక పోవచ్చు, మరికొన్నిసార్లు పాఠకులు ఆ పేరుకు ఉన్న అర్ధం ఏమిటో తెలుసుకోవలసి ఉంటుంది. మీరు ఈ పేర్లను ఎలా అనువదించడానికీ, ప్రజలు వాటిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని అర్ధం చేసుకోవడంలో వారికి సహాయం చేయడంలో ఈ పేజీ మీకు సహాయపడుతుంది.

పేర్ల అర్థం

బైబిలులోని చాలా పేర్లుకు అర్ధాలు ఉన్నాయి. ఎక్కువ సార్లు బైబిలులోని వ్యక్తులు, ప్రదేశాల పేర్లు అవి సూచిస్తున్న వాటిని గుర్తించడానికి ఉపయోగించబడ్డాయి. అయితే కొన్నిసార్లు పేరుకు ఉన్నఅర్థమనేది చాలా ప్రాముఖ్యమైనది.

షాలేమురాజు మెల్కిసెదెకు, మహోన్నతుడగు దేవుని యాజకుడు, అతడు రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును కలిసికొని అతనిని ఆశీర్వదించాడు.(హెబ్రీయులు7:1 ULT)

ఇక్కడ రచయిత "మెల్కిసెదెకు" అనే పేరును ప్రధానంగా ఆ పేరు కలిగి వున్న వ్యక్తిని సూచించడానికి ఉపయోగిస్తున్నాడు. "షాలేము రాజు”అనే బిరుదు అతను పరిపాలించిన ఒక నిర్దిష్ట నగరాన్ని సూచిస్తుంది.

అతని పేరు "మెల్కిసెదెకు" అంటే "నీతికి రాజు," అలాగే "షాలోం రాజు", అంటే "శాంతి యొక్క రాజు". (హెబ్రీయులు7:2 ULT)

ఇక్కడ రచయిత మెల్కిసెదెకు అనే పేరు, బిరుదుల అర్థాన్ని గురించి వివరిస్తున్నాడు, ఎందుకంటే ఆ విషయాలు ఆ వ్యక్తిని గురించి మరింత సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. ఇతర సమయాలో, రచయిత ఆ పేరు అర్ధాన్ని వివరించ లేదు. ఎందుకంటే, అప్పటికే పాఠకుడికి ఆ పేరు అర్ధం తెలుస్తుందని అతను ఆశిస్తున్నాడు. వచన భాగాన్ని అర్థం చేసుకోవడానికి పేరుకు ఉన్నఅర్థం ప్రాముఖ్యమైనదైనట్లయితే, మీరు ఆ అర్థాన్ని వచనంలో గానీ, లేదా పేజీ క్రింద భాగంలోని ఫుట్‌నోట్‌లో చేర్చవచ్చు.

కారణాలు ఇది ఒక అనువాద సమస్య

  • పాఠకులకు బైబిలులోని కొన్ని పేర్లు తెలియక పోవచ్చు. ఆ పేరు ఒక వ్యక్తిని సూచిస్తుందా, లేదా ఏదైనా స్థలాన్ని గానీ, లేదా మరి దేనినైనా తెలియజేస్తుందా అనేది వారికి తెలియక పోవచ్చు.
  • ఆ వచన భాగాన్ని అర్థం చేసుకోవడానికి పాఠకులు పేరుకున్న అర్ధాన్ని తెలుసుకోవలసి ఉంటుంది.
  • కొన్నిపేర్లు మీ భాషలో ఉపయోగించని వివిధ శబ్దాలనూ లేదా శబ్దాల కలయికలనూ కలిగియుండవచ్చు లేదా మీ భాషలో పలకడానికి అప్రియంగా ఉండవచ్చు. ఈలాంటి సమస్యను పరిష్కరించే వ్యూహాo కోసం, చూడండి అరువు పదాలు.
  • బైబిలులోని కొంతమంది ప్రజలకూ, ప్రదేశాలకూ సంబంధించి రెండేసి పేర్లు ఉన్నాయి. ఆ విధమైన రెండు పేర్లు ఒకే వ్యక్తిని లేదా స్థలాన్ని సూచిస్తున్నాయని పాఠకులు గ్రహించలేరు.

బైబిలు నుండి ఉదాహరణలు

మీరు యొర్దాను మీదగా వెళ్ళారు మరియు యెరికో వచ్చారు. యెరికో యొక్క నాయకులు అమోరీయులు కలసి మీకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. (యెహోషువ 24:11 ULT)

"యొర్దాను" అనేది ఒక నది పేరనీ, "యెరికో" అంటే ఒక నగరమని, "అమోరీయులు" అనేది ఒక గుంపుకు సంబంధించిన వారి పేరు అని పాఠకులకు తెలియకపోవచ్చు.

ఆమె చెప్పింది, "ఆయన నన్నుచూసిన తరువాత కూడా నిజంగా నేను చూస్తున్నానా?" కాబట్టి ఆ బావి బెయేర్ లహాయిరోయి అని పిలువబడింది. (ఆదికాడము16:13-14 ULT)

"బెయేర్ లహాయిరోయి" అంటే "నన్ను చూస్తున్న సజీవుని బావి" అనే అర్థం తెలియకపోయినట్లయితే పాఠకులకు రెండవ వాక్యం అర్థం కాకపోవచ్చు.

ఆమె ఆయనకు మోషే అని పేరు పెట్టిoది, మరియు ఇలా చెప్పింది, "ఎందుకంటే నేను అతణ్ణి నీళ్ళలో నుంచి తీశాను" అని చెప్పింది. (నిర్గమకాండము 2:11 ULT)

మోషే అనే పేరుకు హెబ్రీ పదాలలో "బయటకు తీయడం" అని పాఠకులకు  తెలియకపోయినట్లయితే ఆమె అలా ఎందుకు చెప్పిందో పాఠకులకు అర్థం కాక పోవచ్చు.

సౌలు అతని చావుకు సమ్మతించాడు (అపొస్తలుల కార్యములు 8:1 ULT)

ఈకొనియలో ఇలా జరిగింది, పౌలు, మరియు బర్నబా కలిసి యూదుల సమాజ మందిరంలోనికి ప్రవేశించారు (అపొస్తలులకార్యములు14:1 ULT)

సౌలు, పౌలు అనే పేర్లు ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయని పాఠకులకు తెలియక పోవచ్చు.

అనువాదం వ్యూహాలు

  1. పేరు ఏ విధమైన సందర్బాన్ని సూచిస్తుందో పాఠకులు సులభంగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే, దానిని స్పష్టంగా తెలియచేయడానికి మీరు ఒక పదాన్ని జతచేయవచ్చు.
  2. ఒక పేరు చెపుతున్నదానిని గురించి అర్థం చేసుకోడానికి పాఠకులు ఒక పేరు అర్ధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ పేరును గుర్తించండి, దాని అర్ధాన్ని వచనంలో గానీ, లేదా ఫుట్‌నోట్‌లో గానీ చెప్పండి.
  3. లేదా ఒక పేరు చెపుతున్నదానిని గురించి అర్థం చేసుకోడానికి పాఠకులు దాని అర్ధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ పేరు ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడినట్లయితే, పేరును గుర్తించడానికి బదులు ఆ పేరు అర్ధాన్ని అనువదించండి.
  4. ఒక వ్యక్తికీ, లేదా ప్రదేశానికీ రెండు వేరువేరు పేర్లు ఉన్నట్లయితే, ఒక పేరునే ఎక్కువ సార్లు ఉపయోగించండి. వచనభాగం వ్యక్తిని గురించి లేదా ప్రదేశాన్ని గురించి ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉపయోగించినా లేదా ఆ వ్యక్తికి లేదా ప్రదేశానికి ఆ పేరు ఎందుకు ఇవ్వబడిందో అని చెపుతున్నప్పుడు రెండవ పేరును ఉపయోగించండి. మూల వచనం అతి తక్కువగా ఉపయోగిస్తున్న పేరుకు ఫుట్‌నోట్ రాయండి.
  5. లేదా ఒక వ్యక్తికి గానీ, ప్రదేశానికి గాని రెండు వేరు వేరు పేర్లు ఉన్నప్పడు, మూల వచనభాగంలో ఇచ్చిన పేరును వాడండి. మరొక పేరు గనుక ఉంటే ఫుట్‌నోట్‌ను జోడించండి.

అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

(1). పేరు ఏ సందర్భాన్ని సూచిస్తుందో పాఠకులు సుళువుగా అర్థం చేసుకోలేకపోతే, మీరు దానిని స్పష్టంగా వివరించడానికి ఒకపదాన్ని జోడించవచ్చు.

మీరు యొర్దాను మీదగా వెళ్ళారు మరియు యెరికో వచ్చారు. యెరికో యొక్క నాయకులు అమోరీయులు కలసి మీకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. (యెహోషువ 24:11 ULT)

మీరు యొర్దానునది మీదుగా యెరికో నగరానికి వెళ్ళారు. యెరికో యొక్క నాయకులు మీకు వ్యతిరేకంగా అమోరీయుల తెగ తో కలసి పోరాడారు

కొంతసేపటి తర్వాత, కొంతమంది పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, హేరోదు నిన్ను చంపాలని కోరుకుంటున్నందున ఇక్కడి నుండి వెళ్ళు” అని అన్నారు.(లూకా 13:31 ULT)

ఆ సమయంలోనే, కొంతమంది పరిసయ్యులు వచ్చారు మరియ ఆయనతో చెప్పారు, “వెళ్ళు మరియు ఈ స్థలాన్ని విడిచిపెట్టు ఎందుకంటే హేరోదురాజు నిన్ను చంపాలని అనుకుంటున్నాడు.”

(2) ఒక పేరు చెపుతున్నదానిని గురించి అర్థం చేసుకోడానికి పాఠకులు ఒక పేరు అర్ధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ పేరును గుర్తించండి, దాని అర్ధాన్ని వచనంలో గానీ, లేదా ఫుట్‌నోట్‌లో గానీ చెప్పండి.

ఆమె ఆయనకు మోషే అని పేరు పెట్టిoది, మరియు ఇలా చెప్పింది, "ఎందుకంటే నేను అతణ్ణి నీళ్ళలో నుంచి తీశాను" అని చెప్పింది. (నిర్గమకాండము 2:11 ULT)

ఆమె అతనికి మోషే (‘బయటకి తీసాను’ అనే అర్థాన్ని ఇస్తుంది), మరియు ఇలా చెప్పింది, “ఎందుకంటే నేను అతణ్ణి నీళ్ళలో నుండి తీశాను."

(3) లేదా ఒక పేరు చెపుతున్నదానిని గురించి అర్థం చేసుకోడానికి పాఠకులు ఆ పేరు అర్ధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ పేరును గుర్తించండి, దాని అర్ధాన్ని వచనంలో గానీ, లేదా ఫుట్‌నోట్‌లో గానీ చెప్పండి.

.ఆమె చెప్పింది, "ఆయన నన్నుచూసిన తరువాత కూడా నిజంగా నేను చూస్తున్నానా?" కాబట్టి ఆ బావి బెయేర్ లహాయిరోయి అని పిలువబడింది. (ఆదికాడము16:13-14 ULT)

…ఆమె చెప్పింది, "ఆయన నన్నుచూసిన తరువాత కూడా నిజంగా నేను చూస్తున్నానా?" కాబట్టి ఆ బావి నన్ను చూచుచున్న సజీవుని బావి;

(4) ఒక వ్యక్తికీ, లేదా ప్రదేశానికీ రెండు వేరువేరు పేర్లు ఉన్నట్లయితే, ఒక పేరునే ఎక్కువ సార్లు ఉపయోగించండి. వచనభాగం వ్యక్తిని గురించి లేదా ప్రదేశాన్ని గురించి ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉన్పయోగించినా లేదా ఆ వ్యక్తికి లేదా ప్రదేశానికి ఆ పేరు ఎందుకు ఇవ్వబడిందో అని చెపుతున్నప్పుడు రెండవ పేరును ఉపయోగించండి. మూల వచనం అతి తక్కువగా ఉపయోగిస్తున్న పేరుకు ఫుట్‌నోట్ రాయండి. ఉదాహరణకు, అపొస్తలులకార్యములు 13 వ అధ్యాయానికి ముందు అధ్యాయాలలో “పౌలు” పేరును "సౌలు" అని, అపొస్తలులకార్యములు 13 వ అధ్యాయం తరువాత నుండి "పౌలు" అని పిలవడం జరిగింది. అపొస్తలులకార్యములు 13:9 లో తప్పించి మిగిలిన అధ్యాయాలలో అతని పేరును మీరు "పౌలు" అని అనువదించవచ్చు.

…ఆ యువకుని పేరు సౌలు (అపొస్తలులకార్యములు 7:58 ULT)

…ఆ యువకుని పేరు పౌలు 1

ఫుట్‌నోట్ ఇలా ఉంటుంది:

[1] చాలా భాషాంతరాలలో ఇక్కడ సౌలు అని చెప్పడం జరిగింది, అయితే బైబిలులో ఎక్కువ సార్లు అతనిని పౌలు అని పిలిచారు.

తరువాత కథలో, మీరు ఈ విధంగా అనువదించవచ్చు:

అయితే సౌలు అని కూడా పిలువబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడు. (అపొస్తలులకార్యములు 13:9)

అయితే సౌలు అని కూడా పిలువబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడు. (అపొస్తలులకార్యములు 13:9)

(5) లేదా ఒక వ్యక్తికి గానీ, ప్రదేశానికి గాని రెండు వేరు వేరు పేర్లు ఉన్నప్పడు, మూల వచనభాగంలో ఇచ్చిన పేరును వాడండి. మరొక పేరు గనుక ఉంటే ఫుట్‌నోట్‌ను జోడించండి. ఉదాహరణకు, మూల వచనంలో ఎక్కడైతే “సౌలు” అని ఉందో అక్కడ మీరు "సౌలు" అనీ, మూల వచనంలోఎక్కడైతే "పౌలు" అని ఉందో అక్కడ "పౌలు" అని మీరు రాయవచ్చు.

సౌలు అని పిలువబడిన యువకుడు (అపొస్తలులకార్యములు 7:58 ULT)

సౌలు అని పిలువబడిన యువకుడు

ఫుట్‌నోట్ ఇలా ఉంటుంది:

[1] ఈ వ్యక్తినే అపొస్తలులకార్యములు 13 ఆరంభంలో పౌలు అని పిలిచారు.

తరువాత కథలో, మీరు ఈ విధంగా అనువదించవచ్చు:

అయితే సౌలు అని కూడా పిలువబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడు. (అపొస్తలుల కార్యములు 13:9)

అయితే సౌలు అని కూడా పిలువబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడు;

పేరు మార్పును కథ వివరించిన తరువాత, మీరు ఈ విధంగా అనువదించవచ్చు.

ఈకొనియలో జరిగినదేమనగా, పౌలు మరియు బర్నబా కలిసి యూదుల సమాజమందిరములో ప్రవేశించారు. (అపొస్తలులకార్యములు 14:1 ULT)

ఈకొనియలో జరిగినదేమనగా, పౌలు 1 మరియు బర్నబా కలిసి యూదుల సమాజమందిరములో ప్రవేశించారు. (అపొస్తలులకార్యములు 14:1 ULT)

ఫుట్‌నోట్ ఇలా ఉంటుంది:

[1] ఈ వ్యక్తినే అపొస్తలులకార్యములు 13 ముందు పౌలు అని పిలిచారు.