te_ta/translate/translate-transliterate/01.md

8.2 KiB
Raw Permalink Blame History

వివరణ

కొన్ని సమయాలలో మీ సంస్కృతిలో భాగం కాని సంగతులు బైబిలులో ఉంటాయి, వాటికి మీ బాషలో పదాలు ఉండవు. పేర్లు ఉండని మనుష్యులు మరియు ప్రదేశాలు కూడా బైబిలులో ఉంటాయి.

అటువంటి పరిస్థితి సంభవించినప్పుడు బైబిలు నుండి మీకు తెలిసిన భాషలోనికి పదాలను “అరువు” తెచ్చుకోవచ్చును మరియు మీ సొంత భాషలోనికి మీ అనువాదంలో దానిని వినియోగించండి. అంటే మీరు ఇతర బాష నుండి దానిని అనుకరిస్తున్నాడు. పదాలను ఏవిధంగా “అరువు” తెచ్చుకోవాలో ఈ పేజీ మీకు చెపుతుంది. (మీ బాషలో లేని పదాలను అనువదించడానికి కూడా మరికొన్ని విధానాలు ఉన్నాయి. [తెలియని వాటిని అనువదించడం] చూడండి (../translate-unknown/01.md).)

బైబిలు నుండి ఉదాహరణలు

ఆయన దారి పక్కన ఒక అంజూరపు చెట్టును చూసి, ఆయన దాని వద్దకు వెళ్ళాడు. (మత్తయి 21:19 యు.ఎల్.టి)

మీ బాష మాట్లాడే చోట అంజూరపు చెట్లు లేనప్పుడు, మీ బాషలో ఇటువంటి చెట్టుకు పేరు ఉండకపోవచ్చును.

ఆయనకు పైగా సెరాపులు నిలుచున్నారు, ప్రతీ సెరాపుకూ ఆరు రెక్కలు ఉన్నాయి. రెండు రెక్కలతో తన ముఖం కప్పుకొన్నాడు. మరియు రెంటితో అతడు తన కాళ్ళను కప్పుకొన్నాడు, రెంటితో అతడు ఎగురుతూ ఉన్నాడు. (యెషయా 6:2 యు.ఎల్.టి)

ఇటువంటి జీవికి మీ బాషలో పేరు ఉండక పోవచ్చును.

ఇశ్రాయేలు ప్రజలకు మలాకీ యొక్క చేతి చేత వాక్కు యొక్క ప్రకటన. (మలాకీ 1:1 యు.ఎల్.టి)

మీ బాష మాట్లాడే మనుష్యులు మలాకీ అనే పేరును వినియోగించకపోవచ్చును

అనువాద వ్యూహాలు

ఇతర బాషనుండి పదాలను అరువు తెచ్చుకోవడంలో అనేక ఇతర అంశాలను గురించి తెలుసుకోవాలి.

  • హెబ్రీ, గ్రీకు, లాటిన్, సిరిలిక్, దేవంగిరి, కొరియా లాంటి వివిధ బాషలు వివిధ రకాలైన లిపిలను వినియోగిస్తాయి. ఈ అక్షరాలు వారి అక్షరమాలలోని అక్షరాలను చూపించడానికి వివిధ ఆకారాలను వినియోగిస్తాయి.
  • ఒకే లిపిని వినియోగించు బాషలు ఆ లిపిలోని అక్షరాలను భిన్నంగా ఉచ్చరించవచ్చును. ఉదాహరణకు, జర్మన్ బాష మాట్లాడేటప్పుడు ప్రజలు “జే” అక్షరాన్ని ఇంగ్లీషులో “వై” అక్షరాన్ని పలికేలా ఉచ్చరిస్తారు.
  • భాషలన్నీ ఒకే శబ్దాలు లేదా శబ్దాల కలయికలను కలిగి ఉండవు. ఉదాహరణకు, చాలా భాషలలో "థింక్" అనే ఆంగ్ల పదంలో మృదువైన "థ్" శబ్దం లేదు, కొన్ని భాషలు "స్టాప్" పదంలో ఉన్నట్టుగా "స్ట్" వంటి శబ్దాల కలయికతో ఒక పదాన్ని ప్రారంభించలేవు.

ఒక పదాన్ని అరువు తెచ్చుకోడానికి అనేక విధానాలు ఉన్నాయి

  1. మీరు అనువదిస్తున్న భాష నుండి మీ భాష భిన్నమైన లిపిని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ప్రతి అక్షర ఆకారాన్ని మీ భాష లిపికి సంబంధించిన అక్షర ఆకారంతో ప్రత్యామ్నాయం చేయవచ్చు.
  2. ఒక పదాన్నీ ఇతర భాష పలికినట్లు మీరు పలుకవచ్చు, ఆ అక్షరాలను సహజంగా మీ భాష ఉచ్చరించే విధంగా ఉచ్చరించవచ్చు.
  3. మీరు ఇతర భాష చేసే విధంగానే పదాన్ని ఉచ్చరించవచ్చు మీ భాష నియమాలకు తగినట్లుగా అక్షరక్రమాన్ని సర్దుబాటు చేయవచ్చు.

అన్వయింపబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

  1. మీరు అనువదిస్తున్న భాష నుండి మీ భాష భిన్నమైన లిపిని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ప్రతి అక్షర ఆకారాన్ని మీ భాష లిపికి సంబంధించిన అక్షర ఆకారంతో ప్రత్యామ్నాయం చేయవచ్చు.

צְפַנְיָ֤ה - హీబ్రూ అక్షరాలలో మనిషి పేరు.

“జెఫన్యా” అదే పేరు రోమా అక్షరాలలో

(2) ఒక పదాన్నీ ఇతర భాష పలికినట్లు మీరు పలుకవచ్చు, ఆ అక్షరాలను సహజంగా మీ భాష ఉచ్చరించే విధంగా ఉచ్చరించవచ్చు.

జెఫన్యా - ఇది మనిషి పేరు.

"జెఫన్యా" - ఆంగ్లంలో పలుకబడిన పేరు, అయితే మీరు మీ భాష నియమాల ప్రకారం దానిని ఉచ్చరించవచ్చు.

(3) ఒక పదాన్నీ ఇతర భాష పలికినట్లు మీరు పలుకవచ్చు, మీ బాష నియమాలకు తగిన విధంగా అక్షరక్రమాన్ని సర్దుబాటు చెయ్యవచ్చు.

జెఫన్యా - మీ భాషకు "జెడ్" లేకపోతే, మీరు "ఎస్" ను ఉపయోగించవచ్చు. మీ రచనా విధానం "ఫ్" ను ఉపయోగించకపోతే మీరు "ఫ్" ను ఉపయోగించవచ్చు. మీరు "ఐ" ను ఎలా ఉచ్చరిస్తారనే దానిపై ఆధారపడి మీరు "ఐ" లేదా "అయి" లేదా "ఆయె" తో ఉచ్చరించవచ్చు.

”సెఫనియా” “సెఫనైయా” "సెఫన్యా”