te_ta/translate/writing-apocalypticwriting/01.md

17 KiB

వివరణ

సంకేతాత్మక ప్రవచనం అనేది ఒక ప్రవక్తకు దేవుడు ఇచ్చిన సందేశం, తద్వారా ప్రవక్త ఇతరులకు చెప్పుతాడు. ఈ సందేశాలు భవిష్యత్తులో దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో చూపించడానికి రూపాలు, చిహ్నాలను ఉపయోగిస్తాయి.

ఈ ప్రవచనాలను కలిగి ఉన్న ప్రధాన గ్రంథాలు యెషయా, యెహెజ్కేలు, దానియేలు, జెకర్యా, ప్రకటన. సంకేతాత్మక ప్రవచనానికి క్లుప్త ఉదాహరణలు మత్తయి 24, మార్కు 13, లూకా 21 వంటి ఇతర గ్రంథంలో కూడా కనిపిస్తాయి.

దేవుడు ప్రతి సందేశాన్ని ఎలా చెపుతున్నాడో, ఆ సందేశం ఏమిటో బైబిల్ చెబుతుంది. దేవుడు సందేశాలను ఇచ్చినప్పుడు, కలలు, దర్శనాల వంటి అద్భుత మార్గాల్లో ఆయన తరచూ అలా చేశాడు. ("కల" ను, “దర్శనాన్ని” అనువదించడానికి సహాయం కోసం dream and vision చూడండి. ప్రవక్తలు ఈ కలలనూ, దర్శనాలనూ చూసినప్పుడు, వారు తరచుగా దేవుని గురించీ, పరలోకం గురించీ రూపాలనూ, గుర్తులనూ చూశారు. ఈ రూపాలలో సింహాసనం, బంగారు దీప స్తంభాలు, తెల్లని వెంట్రుకలు, తెల్లని వస్త్రాలు, అగ్ని వంటి కళ్ళు, కంచు వంటి కాళ్ళు కలిగిన మనిషి ఉన్నారు. ఈ రూపాలలో కొన్నింటిని ఒకరు కంటే ఎక్కువ మంది ప్రవక్తలు చూశారు.

ప్రపంచం గురించిన ప్రవచనాలలో రూపాలూ, చిహ్నాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, కొన్ని ప్రవచనాలలో బలమైన జంతువులు రాజ్యాలను సూచిస్తాయి, కొమ్ములు రాజులను లేదా రాజ్యాలను సూచిస్తాయి, ఒక ఘట సర్పం లేదా సర్పం సాతానును సూచిస్తుంది, సముద్రం దేశాలను సూచిస్తుంది, వారాలు ఎక్కువ కాలాన్ని సూచిస్తాయి. ఈ రూపాలలో కొన్నింటిని ఒకరి కంటే ఎక్కువ మంది ప్రవక్తలు కూడా చూశారు.

దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా తీర్పు తీరుస్తాడో, పాపాన్ని ఏవిధంగా శిక్షిస్తాడో, ఆయన సృష్టించబోతున్న నూతన లోకంలో ఏవిధంగా నీతి రాజ్యాన్ని స్థాపించాడో ప్రవచనాలు చెబుతున్నాయి. పరలోకం, నరకం గురించి జరగబోయే విషయాల గురించి కూడా వారు చెపుతారు.

బైబిల్లో ఎక్కువ ప్రవచనం పద్యంగా చెప్పబడింది. కొన్ని సంస్కృతులలో పద్య రూపంలో ఏదైనా చెప్పినట్లు ప్రజలు ఊహించినట్లయితే, అది నిజం కాకపోవచ్చు లేదా చాలా ముఖ్యమైనది కాకపోవచ్చు అని తలస్తారు. అయితే బైబిలులోని ప్రవచనం పద్య రూపంలోగానీ లేదా పద్యరూపంలో కాకుండా ఉన్న రూపంలో చెప్పినా అది వాస్తవం, చాలా ప్రాముఖ్యం.

కొన్నిసార్లు ఈ గ్రంథాలలో గతంలో జరిగిన సంఘటనల కోసం భూత కాలం ఉపయోగిస్తారు. అయితే, కొన్నిసార్లు భవిష్యత్తులో జరిగే సంఘటనల కోసం భూత కాలం ఉపయోగిస్తారు. మనకు రెండు కారణాలు ఉన్నాయి. ప్రవక్తలు కలలోగానీ లేదా దర్శనంలో గానీ చూసిన విషయాల గురించి చెప్పినప్పుడు, వారి కల గతంలో ఉన్నందున వారు తరచూ భూత కాలాన్ని ఉపయోగించారు. భవిష్యత్ సంఘటనలను సూచించడానికి భూత కాలాన్ని ఉపయోగించటానికి మరొక కారణం, ఆ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని నొక్కి చెప్పడం. సంఘటనలు జరగడం చాలా నిశ్చయంగా ఉంది, అవి అప్పటికే జరిగినట్లుగా ఉంది. భూత కాలం ఈ రెండవ ఉపయోగం "భవిష్యత్తును చెప్పే గతం" అని పిలుస్తాము. Predictive Past చూడండి.

ప్రవక్తలు వాటిని గురించి చెప్పిన తరువాత వీటిలో కొన్ని జరిగాయి, వాటిలో కొన్ని ఈ లోకాంతంలో జరుగుతాయి.

కారణాలు ఇది అనువాద సమస్య

  • కొన్ని రూపాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనం ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదు.
  • మనం చూడనివీ లేదా ఈ ప్రపంచంలో లేని విషయాల వివరణలు అనువదించడం కష్టం.
  • దేవుడు లేదా ప్రవక్త భూత కాలాన్ని ఉపయోగించినట్లయితే, ఇంతకు ముందే జరిగిన దానిని గురించి మాట్లాడు తున్నారా లేదా తరువాత జరుగబోయే దానిని గురించి మాట్లాడుతున్నారా అని పాఠకులు తెలుసుకోవడం కష్టం కావచ్చు.

అనువాద సూత్రాలు

  • వచనంలోని రూపాలను అనువదించండి. వాటిని అర్థీకరించడానికీ, అర్థాన్ని అనువదించడానికి ప్రయత్నించవద్దు.
  • ఒక రూపం బైబిలులో ఒకటి కంటే ఎక్కువ చోట్ల కనిపించినప్పుడూ, అది అదే విధంగా వివరించినప్పుడు, అన్ని ప్రదేశాలలో ఒకే విధంగా అనువదించడానికి ప్రయత్నించండి.
  • పద్య రూపాలు లేదా పద్యం కాని రూపాలు మీ పాఠకులకు ప్రవచనం నిజం కాదని లేదా ముఖ్యం కాదని సూచిస్తుంటే, ఆ విషయాలను సూచించని ఒక రూపాన్ని ఉపయోగించండి.
  • కొన్నిసార్లు వివిధ ప్రవచనాలలో వివరించిన సంఘటనలు ఏ క్రమంలో జరుగుతాయో అర్థం చేసుకోవడం కష్టం. ప్రతి ప్రవచనంలో కనిపించే విధంగా వాటిని రాయండి.
  • బోధించేవారి అర్థం ఏమిటో పాఠకులకు అర్థమయ్యే విధంగా కాలాన్ని అనువదించండి. ముందుగా ఊహించిన గతాన్ని పాఠకులు అర్థం చేసుకోకపోతే, భవిష్యత్ కాలాన్ని ఉపయోగించడం ఆమోదయోగ్యమైనది.
  • ప్రవక్తలు వారి గురించి వ్రాసిన తరువాత కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. వాటిలో కొన్ని ఇంకా నెరవేరలేదు. ఈ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరతాయో లేదా అవి ఎలా నెరవేరాయో ప్రవచనంలో స్పష్టం చేయవద్దు.

బైబిలు నుండి ఉదాహరణలు

ఈ క్రింది భాగాలు యెహెజ్కేలు, దానియేలు, యోహానులు చూసిన శక్తివంతమైన జీవులను వివరిస్తాయి. ఈ దర్శనాలలో వచ్చే రూపాలలో ఉన్ని వలె తెల్లగా ఉండే జుట్టు, అనేక జలధారల వంటి స్వరం, బంగారు దట్టి, మెరుగు పెట్టిన కంచు వంటి కాళ్ళు లేదా పాదాలు ఉన్నాయి. ప్రవక్తలు వివిధ వివరాలను చూసినప్పటికీ, అదే వివరాలను ఒకే విధంగా అనువదించడం మంచిది. ప్రకటన గ్రంథం నుండి గుర్తించిన పదబంధాలు దానియేలు, యెహెజ్కేలు నుండి వచ్చిన భాగాలలో కూడా ఉన్నాయి

దీపస్తంభాల మధ్య మానవ పుత్రుడి లాంటి వ్యక్తి కనిపించాడు. ఆయన తొడుక్కొన్న నిలువుటంగీ పాదాలవరకు ఉంది. ఆయన ఛాతీ మీద బంగారు దట్టి✽ కట్టి ఉంది. ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్ని లాగా, మంచంత తెల్లగా ఉన్నాయి. ఆయన కండ్లు మంటల్లాంటివి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ మెరుస్తున్న కంచు లాగా ఉన్నాయి. ఆయన స్వరం అనేక జల ప్రవాహాల ధ్వని✽ లాంటిది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఆయనకున్నాయి. ఆయన నోట్లోనుంచి పదునైన రెండంచుల ఖడ్గం వస్తున్నది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యమండలం లాంటిది. ప్రకటన 1:13-16 యు.ఎల్.టి) lockquote>

నేను ఇంకా చూస్తూ ఉంటే, సింహాసనాలు నెలకొల్పడం జరిగింది. అనాది సిద్ధమైనవాడు కూర్చున్నాడు. ఆయన వస్త్రం చలిమంచంత తెలుపు. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రెబొచ్చులాగా ఉన్నాయి. (దానియేలు 7:9 యు.ఎల్.టి)

నేను తలెత్తి చూస్తే, సన్నని నారబట్టలు తొడుక్కొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని నడిమికి మేలిమి బంగారు నడికట్టు ఉంది. అతని శరీరం గోమేధికం లాంటిది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కండ్లు మండుతూ ఉన్న దివిటీలలాంటివి. అతని చేతులూ కాళ్ళూ మెరుగు పెట్టిన కంచులాగా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠధ్వని మానవ సమూహం చేసే కలకలంలాంటిది. (దానియేలు 10:5-6 యు.ఎల్.టి)

ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం తూర్పు దిక్కునుంచి రావడం నాకు కనిపించింది. ఆయన స్వరం జలప్రవాహాలధ్వనిలాంటిది. ఆయన శోభాప్రకాశం చేత భూమి ప్రకాశించింది. (యెహెజ్కేలు 43:2 యు.ఎల్.టి)

గత సంఘటనలను సూచించడానికి భూత కాల ఉపయోగాన్ని ఈ క్రింది వాక్య భాగం చూపిస్తుంది. గుర్తించబడిన క్రియలు గత సంఘటనలను సూచిస్తాయి.

ఇది యూదా దేశాన్ని గురించి, జెరుసలం గురించి ఆమోజు కొడుకు యెషయాకు వచ్చిన దర్శనం. ఇది యూదా రాజులు ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా రోజులలో వచ్చినది.

ఆకాశాల్లారా, ఆలకించండి ! భూమీ, విను! యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు: “నేను పిల్లలను పెంచి పోషించాను. వారు నాకు ఎదురు తిరిగారు. (యెషయా 1:1-2 యు.ఎల్.టి)

ఈ క్రింది వచన భాగం భవిష్యత్తు కాలం, భూత కాలంలోని విభిన్న ప్రయోజనాలను చూపిస్తుంది. గుర్తించబడిన క్రియలు ఊహించబడిన గతానికి ఉదాహరణలు, ఇక్కడ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని చూపించడానికి భూత కాలం ఉపయోగించబడుతుంది.

అయినా వేదనపాలైన దేశం మీద చీకటి నిలవదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను ప్రదేశాన్ని, నఫ్తాలి ప్రదేశాన్ని సిగ్గుపాటు చేశాడు. భవిష్యత్తులో, సముద్రంవైపు యొర్దాను ఇవతల ఉన్న జనాల గలలీ ప్రాంతాన్ని ఆయన గొప్ప చేస్తాడు. 2 చీకటిలో నడిచే ప్రజకు గొప్ప కాంతి కనిపిస్తుంది. చావునీడ✽ ఉన్న దేశంలో నివసించే వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది (యెషయా 9:1-2 యు.ఎల్.టి)